Trumps First Speech : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అందులోని ముఖ్య అంశాలను తెలుసుకోబోయే ముందు మనం ఆయన జారీ చేసిన రెండు కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల గురించి తెలుసుకుందాం. వాటిలో ఒకదానితో మన భారతీయులకు బాగా సంబంధం ఉంటుంది. అదేమిటంటే.. అమెరికాకు వలస వచ్చిన వారికి జన్మించే పిల్లలకు దేశ పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ (Donald Trump) రద్దు చేశారు. దీనిపై ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీంతో గత శతాబ్దకాలంగా అమల్లో ఉన్న కీలక చట్టం రద్దయింది. అయితే ఈ విధానాన్ని రద్దు చేసే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక చైనా సోషల్ మీడియా కంపెనీ టిక్‌టాక్ అమెరికా వ్యాపారాన్ని ఏదైనా అమెరికా కంపెనీకి అమ్మేయాలి. ఇందుకు ఇచ్చిన గడువు జనవరి 19తో ముగిసింది. దీంతో ఆ గడువును మరో 75 రోజులు పెంచుతూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
Also Read :Earthquake : తైవాన్‌లో భూకంపం.. భయంతో రోడ్లపైకి జనం.. 27 మందికి గాయాలు
ట్రంప్ తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు
- గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఇక గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పిలుస్తామని ట్రంప్(Trumps First Speech) తెలిపారు.
- అమెరికా దక్షిణ సరిహద్దులో నేషనల్ ఎమర్జెన్సీని ట్రంప్ ప్రకటించారు. అక్రమ వలసల్ని అక్కడే నిలిపివేస్తామన్నారు.
- అంగారక (మార్స్) గ్రహంపై అమెరికా జెండాను పాతుతామని వెల్లడించారు. అక్కడికి వ్యోమగాములను పంపుతామన్నారు.
- అమెరికా భూభాగం విస్తరణకు చర్యలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు.
- పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది.
- అమెరికాలో పురుషులు, స్త్రీలు అనే రెండు జెండర్స్ మాత్రమే ఉంటాయి. మూడో జెండర్ ఉండదు.
- ‘‘పనామా కాల్వ మీదుగా వెళ్లే అమెరికా నౌకలపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అందులో అమెరికా నేవీ నౌకలు కూడా ఉన్నాయి. పనామా కాలువను చైనా నిర్వహిస్తోంది. చైనా నుంచి పనామా కాలువ తిరిగి తీసుకుంటాం’’ అని ట్రంప్ తెలిపారు.
Also Read :Midday Meal Scheme : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. ఎందుకంటే ?
రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు
‘‘ఉక్రెయిన్‌తో పుతిన్ ఒప్పందం చేసుకోవాలి. ఆ పనిచేయకుండా రష్యాను నాశనం చేస్తున్నాడు. రష్యా పెద్ద చిక్కుల్లో పడనుంది’’ అని ట్రంప్ తెలిపారు. ‘‘నేను పుతిన్‌ను కలవనున్నాను. ఉక్రెయిన్‌తో సంధిని ఆయన కోరుకుంటారని ఆశిస్తున్నాను. జెలెన్‌స్కీ కూడా శాంతిని కోరుకుంటున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.