Kamala Certified Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచారని.. ఆయన ప్రత్యర్థి కమలా హ్యారిస్ స్వయంగా ధ్రువీకరించారు. అది కూడా అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం వేదికగా!! దాదాపు 538 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనెటర్ల సమక్షంలో కమలా హ్యారిస్ ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా ? మరేం లేదు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉండేవారే అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశానికి అధ్యక్షత(Kamala Certified Trump) వహించాలి. ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా కమల ఉన్నారు. అందుకే తాజాగా జరిగిన అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు.
Also Read :Tremors In India : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. బిహార్, ఢిల్లీ, బెంగాల్‌లో ప్రకంపనలు
ఈసందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ధ్రువీకరణ కోసం ఆమె ప్రత్యేక ఓటింగును నిర్వహించారు. మొత్తం 538 మంది సభ్యులకుగానూ 226 మంది కమలకు మద్దతుగా ఓట్లు వేశారు. అయితే 312 మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓట్లు వేశారు. దీంతో అమెరికా ఎన్నికల ఫలితాల ధ్రువీకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈవివరాలను స్వయంగా కమలా హ్యారిస్ సభ ఎదుట చదివి వినిపించారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సెషన్ జరిగింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్ ఎన్నికయ్యారని కమల వెల్లడించారు. ఈ ప్రకటన చేసినప్పుడు జేడీ వాన్స్ అమెరికా కాంగ్రెస్ సమావేశ మందిరంలోనే ఉన్నారు.
Also Read :Allu Arjun: నేడు శ్రీతేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్?
ఈ అంశంపై కాబోయే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తమ ఘన విజయాన్ని అమెరికా కాంగ్రెస్ ధ్రువీకరించడంపై హర్షం వెలిబుచ్చారు. అది చారిత్రక క్షణమని పేర్కొన్నారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మారుస్తామని ఆయన పునరుద్ఘాటించారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా ఉండాలని చాలామంది కెనడా ప్రజలు కోరుకుంటున్నారని ట్రంప్ తెలిపారు. కెనడా ఒకవేళ అమెరికాలో కలిస్తే దానిపై వాణిజ్యపరమైన టారిఫ్‌లు, పన్నులు వేయబోమని స్పష్టం చేశారు.