Kamala Harris : బైడెన్ బదులు కమల.. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఛాన్స్ ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రస్తుత అధ్యక్షుడు 81 ఏళ్ల జో బైడెన్ డిబేట్ అనంతరం లెక్కలు మారాయి.

Published By: HashtagU Telugu Desk
Kamala Harris

Kamala Harris : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రస్తుత అధ్యక్షుడు 81 ఏళ్ల జో బైడెన్ డిబేట్ అనంతరం లెక్కలు మారాయి. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ కొనసాగితే గెలిచే అవకాశాలు తక్కువని సర్వేలు కోడై కూస్తున్నాయి. సాక్షాత్తూ బైడెన్ సన్నిహితులు, స్నేహితులు, డెమొక్రటిక్ పార్టీ నేతలు కూడా స్వరం మార్చారు. బైడెన్ తప్పుకొని వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ తరుణంలో యావత్ భారత దేశానికి గర్వం కలిగించే ఓ పేరు తెరపైకి వచ్చింది. అదే కమలా హ్యారిస్(Kamala Harris).

We’re now on WhatsApp. Click to Join

కమలా హ్యారిస్ ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందిస్తున్నారు. వైట్ హౌస్‌పై, అమెరికా పాలనపై అవగాహన కలిగిన వ్యక్తి కావడంతో ఆమెకు  ఈసారి డెమొక్రటిక్ పార్టీ నుంచి అవకాశం కల్పిస్తే డెమొక్రటిక్ పార్టీకి గెలుపు అవకాశాలు పెరుగుతాయని  సీఎన్ఎన్ నిర్వహించిన ఒక పోల్‌లో వెల్లడైంది. అయితే ఈ అంశాన్ని డెమొక్రటిక్ పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందా ? లేదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జులై 21 నుంచి ఆగస్టు 7 వరకు జరగనున్న డెమొక్రటిక్ పార్టీ వర్చువల్ సమావేశాల్లో అధ్యక్ష అభ్యర్థిపై తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు.  డెెమొక్రటిక్ పార్టీ అనూహ్యంగా కమలా హ్యారిస్ లేదా మరొకరికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించినా ఆశ్చర్యం లేదు. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.

Also Read :New Car: కేవలం రూ. 7 లక్షలకే బెస్ట్ SUV కార్స్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ఇప్పటికిప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగితే ట్రంపే గెలుస్తారని సర్వేలు అంచనా వేస్తున్నాయి. సీఎన్ఎన్ పోల్ ప్రకారం.. బైడెన్ కంటే ట్రంప్ ఆరు పాయింట్లతో ముందంజలో ఉన్నారు. దేశ ఓటర్లలో 47 శాతం మంది ట్రంప్‌కు మద్దతుగా, 45 శాతం కమలా హ్యారిస్‌కు మద్దతుగా ఉన్నారని  సీఎన్ఎన్ పోల్ చెప్పింది. ఇలాంటి అంశాలు కమలా హ్యారిస్‌కు కీలక అవకాశాన్ని కల్పించే ఛాన్స్ లేకపోలేదు. అమెరికాలోని మహిళా ఓటర్ల నుంచి ట్రంప్‌పై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. దాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు డెమొక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్‌ను అభ్యర్థిగా నిలిపే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. 

Also Read :Cloves: లవంగం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

  Last Updated: 03 Jul 2024, 07:54 AM IST