Site icon HashtagU Telugu

Kabul: కాబూల్ ఆర్మీ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు.. ఏకంగా 10 మంది పౌరులు స్పాట్ డెడ్?

Afghan Baby 63467

Afghan Baby 63467

Kabul: కొత్త సంవత్సరం లోకి అడుగు పెట్టిన కొన్ని గంటలల్లోనే మృత్యువు ఒడిన పడ్డారు పౌరులు. ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయిన కాబూల్ లో మిలిటరీ ఎయిర్ పోర్ట్ లోపల పెద్ద శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. ఇక ఈ విషయాన్ని పలువురు అధికారులు తెలిపారు.

ఇక ఆ ఘటనలో పదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ విషయాన్ని ఆర్మీ ప్రతినిధి అబ్దుల్ నాఫీ టకోర్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపాడు. ఇప్పటికి ఈ పేలుడుకు గల కారణాలు తెలియలేదు అన్నాడు.

ఇక ఈ ఘటన ప్రస్తుతం కలకలం సృష్టించింది. అయితే గత ఏడాది డిసెంబర్ 12న కూడా కాబూల్ లోని గుర్తు తెలియని సాయుధుడు ఓ హోటల్ లో కాల్పులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆ హోటల్లో చైనా పౌరులు కూడా ఉన్నారు. ఇక తాలిబన్ భద్రత దళాలు అక్కడికి చేరుకునే లోపే హోటల్ నుంచి భారీగా పొగలు వచ్చినట్లుగా కొన్ని వీడియోల ద్వారా బయటపడ్డాయి.

ఈ ఘటన వెనుక కారణం పై ప్రయత్నాలు చేస్తున్న అధికారులు..

ఇక ఈ రోజే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగా ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ప్రస్తుతం ఆ పౌరుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. గాయాలకు గురైన పలువురు పౌరులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ పేలుడు వెనుక ఎవరి చేయి ఉంది అనేది అక్కడి అధికారులకు అనుమానాలు ఉన్నాయి. అక్కడున్న సీసీ కెమెరాల ఆధారంగా ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది అని అధికారులు వెతికినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.