Site icon HashtagU Telugu

Joe Biden: మరోసారి డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా జో బెడైన్ నామినేష‌న్ ఖ‌రారు

Joe Biden Clinches Democrat

Joe Biden Clinches Democrat

 

Joe Biden: అమెరికా దేశాధ్య‌క్షుడు జో బెడైన్(Joe Biden) మ‌రోసారి అధ్య‌క్ష అభ్య‌ర్థిగా(presidential candidate)పోటీ ప‌డ‌నున్నారు. ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున ఆయ‌న నామినేష‌న్ ఖ‌రారు అయ్యింది. బ‌హుశా ఆయ‌న తుది పోరులో రిప‌బ్లిక‌న్ నేత డోనాల్డ్ ట్రంప్‌(Donald Trump)తోనే అధ్య‌క్ష రేసులో పోటీప‌డే ఛాన్సు ఉంద‌ని అమెరికా మీడియా పేర్కొన్న‌ది. అమెరికాలోని గ‌డిచిన 70 ఏళ్ల చ‌రిత్ర‌లో ఇద్ద‌రు అభ్య‌ర్థులు రెండోసారి మ‌ళ్లీ పోటీప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున బైడెన్ త‌న అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసుకునేందుకు 1968 డిలీగేట్ల‌ను నెగ్గాల్సి ఉంటుంది. అయితే నామినేష‌న్‌కు కావాల్సిన సంఖ్యా బ‌లాన్ని ఆయ‌న దాటివేసిన‌ట్లు ఎడిస‌న్ రీస‌ర్చ్ తెలిపింది. జార్జియా రాష్ట్రానికి చెందిన ప్రైమ‌రీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలుబ‌డ‌డంతో బైడెన్ రూట్ క్లియ‌ర్ అయ్యింది. ఇంకా మిస్సిసిపీ, వాషింగ్ట‌న్ స్టేట్‌, నార్త‌ర్న్ మారియానా ఐలాండ్స్ ఫ‌లితాలు రావాల్సి ఉన్న‌ది.

read also: 234 Fighters Killed : 234 మంది ఫైటర్లు హతం.. బార్డర్‌లో హైఅలర్ట్

డోనాల్డ్ ట్రంప్ కూడా రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున దాదాపు త‌న నామినేష‌న్ ఖ‌రారు చేసుకునే అవ‌కాశం ఉన్న‌ది. జార్జియా ఫ‌లితాల‌తో ఆ అంశం తేల‌నున్న‌ది. గ‌త మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రైమ‌రీలో ట్రంప్ త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే.ఆ త‌ర్వాత రేసులో ఉన్న నిక్కీ హేలీ కూడా త‌ప్పుకున్నారు. దీంతో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున ట్రంప్ త‌న నామినేష‌న్‌ను చేజిక్కించుకునే ఛాన్స్ క్లియ‌రైంది.