Elderly Population : జపాన్‌ను జనాభా సమస్య వేధిస్తోంది. 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారి జనసంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం జపాన్‌లో 65 ఏళ్లకు పైబడినవారి జనాభా 3.62 కోట్లకు చేరింది. ఈ గణాంకాలను జపాన్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధుల జనాభా(Elderly Population) పెరుగుతున్న దేశంగా జపాన్ మారుతుండటంపై అక్కడి ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read :Yemen Vs Israel : ఇజ్రాయెల్‌కు హౌతీ మిస్సైళ్ల వణుకు.. హౌతీలకు మిస్సైళ్లు ఇచ్చిందెవరు ?
ప్రస్తుతం జపాన్ మొత్తం జనాభాలో వృద్ధులు 29.3 శాతం మంది ఉన్నారు. ఇంత భారీ సంఖ్యకు జపాన్ జనాభా పెరగడం ఇదే తొలిసారి. ఇటలీ, పోర్చుగల్, గ్రీస్, ఫిన్లాండ్, జర్మనీ, క్రొయేషియా దేశాలలోనూ 65 ఏళ్లకు పైబడిన ముసలివారి సంఖ్య 20 శాతానికిపైనే ఉంది. దక్షిణ కొరియాలో 19.3 శాతం మంది, చైనాలో 14.7 శాతం మంది 65 ఏళ్లకు పైబడినవారు ఉన్నారు. జపాన్‌లో ఓవరాల్‌గా జనాభా క్రమంగా తగ్గుతోంది. దీంతో ఎక్కువ మంది పిల్లలను కనే వారికి అక్కడి ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తోంది. జపాన్ దేశ జనాభా దాదాపు 5.95 లక్షలు తగ్గిపోయి 12.4 కోట్లకు చేరింది. 2023 సంవత్సరంలో జపాన్‌లో 91 లక్షల మంది వృద్ధులు ఉపాధి అవకాశాలను పొందారు. అదొక రికార్డు. జపాన్ దేశానికి చెందిన మొత్తం శ్రామిక శక్తిలో 13.5 శాతం మేర వృద్ధులే ఉండటం గమనార్హం. అంటే ప్రతీ ఏడుగురు ఉద్యోగుల్లో ఒకరు వృద్ధులే ఉన్నారు.
Also Read :Caste Column : ఈసారి జనగణన ఫార్మాట్‌లో ‘కులం’ కాలమ్.. కేంద్రం యోచన
వయో వృద్ధులకు మోడీ గుడ్ న్యూస్
భారత్‌లోని వృద్ధులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవలే ఒక గుడ్ న్యూస్ చెప్పారు. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తామని ఆయన వెల్లడించారు. దీనివల్ల 70 ఏళ్లు నిండితే చాలు ఆర్థిక పరిస్థితులు ఇతర వ్యవహారాలతో సంబంధం లేకుండా రూ.5లక్షల దాకా ఆరోగ్య బీమాను ప్రజలు పొందొచ్చు. ఈస్కీం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వైద్యం పొందొచ్చు. ఈ పథకం కిందఇప్పటికే ఉన్న కుటుంబాల్లో సీనియర్ సిటిజన్లకు మరో అయిదు లక్షల బీమా వర్తింపజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.