Earthquake In Russia : రష్యా లో భారీ భూకంపం వస్తుందని ముందే హెచ్చరించిన రియో టాట్సు

Earthquake In Russia : ఈ భూకంపం నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన అంశం 'ది ఫ్యూచర్ ఐ సా' (The Future I Saw) అనే జపనీస్ మంగా (గ్రాఫిక్ నవల్). రియో టాట్సుకి అనే రచయిత 1999లో రచించిన ఈ మంగా పుస్తకంలో 2025 జూలైలో భారీ ప్రకృతి విపత్తు సంభవించనుందని స్పష్టంగా పేర్కొనబడింది.

Published By: HashtagU Telugu Desk
The Future I Saw

The Future I Saw

రష్యాలో సంభవించిన భారీ భూకంపం (Earthquake ) ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. భూకంప తీవ్రత 8.8గా నమోదవడం, దాని ప్రభావం జపాన్ దేశానికీ పడటం ఈ ప్రకృతి విపత్తు తీవ్రత ఎంతవైపుకెళ్లిందో సూచిస్తోంది. రష్యా, జపాన్ దేశాల్లోని తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా, పసిఫిక్ ప్రాంతంలోని ఇతర దేశాలు కూడా అప్రమత్తం అయ్యాయి. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు స్థానిక ప్రభుత్వాలు తీర ప్రాంతాల ఖాళీ చేసే చర్యలు తీసుకున్నాయి.

ఈ భూకంపం నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన అంశం ‘ది ఫ్యూచర్ ఐ సా’ (The Future I Saw) అనే జపనీస్ మంగా (గ్రాఫిక్ నవల్). రియో టాట్సుకి అనే రచయిత 1999లో రచించిన ఈ మంగా పుస్తకంలో 2025 జూలైలో భారీ ప్రకృతి విపత్తు సంభవించనుందని స్పష్టంగా పేర్కొనబడింది. మంగా వతాషి గ మితా మరై అనే పేరుతో జపాన్‌లో ప్రచురితమైన ఈ పుస్తకం గతంలో జరిగిన అనేక సంఘటనలను అంచనా వేసి నిజం చేసినట్టు భావిస్తున్నారు. ప్రిన్సెస్ డయానా మరణం, కోవిడ్-19 వ్యాప్తి, 2011 సునామీ వంటివి దీనిలో ముందే పేర్కొన్నాయి. జూలై 5 తేదీని ఉద్దేశించి “ఏదో పెద్ద విపత్తు సంభవిస్తుంది” అని టాట్సుకి పేర్కొనడంతో కొంతకాలం ఈ అంశం చర్చలో ఉండగా, ఆ తేదీ నిశ్శబ్దంగా గడిచిపోవడంతో చాలామంది దాన్ని పట్టించుకోలేదు. కానీ రష్యాలో సంభవించిన ఈ భారీ భూకంపంతో మళ్లీ ఆ పుస్తకం పునఃచర్చకు వచ్చింది. జపాన్ ప్రజలు టాట్సుకి అంచనాలపై తిరిగి చర్చించటం మొదలుపెట్టారు. 2011 సునామీ సమయంలో అతను చేసిన అంచనాలు నిజం కావడంతో, ఈసారి కూడా ఆయన అంచనాలు ఆమోదయోగ్యంగా భావిస్తున్నారు.

School Principal : వాడు ఉపాధ్యాయుడు కాదు కామాంధుడు

రష్యాలో భూకంపం సంభవించిన ప్రాంతంలో 1952 తర్వాత ఇదే అతిపెద్ద ప్రకృతి విపత్తుగా పేర్కొంటున్నారు. ఈ భూకంపం ప్రభావం అటు జపాన్, ఇటు అమెరికా తీరప్రాంతాలపై పడే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ సముద్ర భద్రత సంస్థలు అప్రమత్తమయ్యాయి. నెటిజన్లు జపాన్ ప్రజలు సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వాలు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సంఘటనతో భవిష్యత్తు అంచనాలు, ప్రకృతి విధ్వంసాల మధ్య సంబంధాలపై కొత్తగా చర్చ మొదలైంది.

  Last Updated: 30 Jul 2025, 01:21 PM IST