Site icon HashtagU Telugu

Japan Rocket Experiment: జపాన్ లో ఆవు పేడతో రాకెట్ తయారీ

Japan Rocket Experiment

Japan Rocket Experiment

Japan Rocket Experiment: సంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోల్చితే లిక్విడ్ బయో మిథేన్ ఆధారిత ఇంజన్ల ఖర్చు చాలా తక్కువని జపాన్ స్పేస్ బలంగా నమ్మింది. ఈ నేపథ్యంలోనే అక్కడి ఇంజనీర్లు తమ రాకెట్లను ఆవు పేడతో తయారు చేసి అద్భుతం చేశారు. టెక్నాలజీలో జపాన్ దే అగ్రతాంబూలం. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి చేసిన దేశం జపాన్. సరికొత్తగా ఆలోచించే ఇంజినీర్లు సంప్రదాయ రాకెట్ ని తయారు చేసి చరిత్ర సృష్టించారు. ఈ ప్రయోగం ఉద్గారాలను తగ్గించడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది ఇంధన కొరత సమస్యలను కూడా పరిష్కరిస్తుందని అన్నారు.

జపనీస్ స్పేస్ స్టార్టప్ ఇంటర్‌స్టెల్లార్ టెక్నాలజీస్ హక్కైడో స్పేస్‌పోర్ట్ నుండి ఆవు పేడతో నడిచే రాకెట్‌ను ప్రయోగించింది. ఈ రాకెట్‌లో ఆవు పేడ నుంచి తయారయ్యే బయోమీథేన్ వాయువును ఇంధనంగా ఉపయోగిస్తారు. సహజ వనరులతో రూపొందించిన ఈ రాకెట్ ప్రయోగం అంతరిక్ష పరిశోధన రంగంలో మహాద్భుతం కాబోతున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సంప్రదాయ రాకెట్ ఇంజిన్లతో పోలిస్తే బయోమీథేన్‌తో అతి తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు చేయవచ్చు.

Also Read: Aloo Bonda: చలికాలం వేడివేడిగా ఏదైనా తినాలని ఉందా.. అయితే ఆలు బోండాలు ట్రై చేయాల్సిందే?