Japan : జపాన్‌లో ఆటోమేటిక్‌ కార్గో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థ.. ఎలా పనిచేస్తుంది ?

ఆ ప్రాజెక్టు ఎలా ఉంటుందనేది తెలుపుతూ ఒక నమూనా వీడియోను జపాన్(Japan) ప్రభుత్వం రిలీజ్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Japan Automated Cargo Transport System

Japan : జపాన్ దేశ రవాణా వ్యవస్థలో మరో విప్లవాత్మక ముందడుగు పడనుంది. త్వరలోనే ఆటోమేటిక్‌ కార్గో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కన్వేయర్‌ బెల్ట్‌ సాయంతో ఒసాకా, టోక్యో నగరాల మధ్య పార్సిళ్ల రవాణాకు ప్రత్యేక మార్గాన్ని నిర్మించనుంది. ఆ ప్రాజెక్టు ఎలా ఉంటుందనేది తెలుపుతూ ఒక నమూనా వీడియోను జపాన్(Japan) ప్రభుత్వం రిలీజ్ చేసింది. 2027 నాటికి ఆటోమేటిక్‌ కార్గో ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రయల్‌ రన్‌‌ను నిర్వహించాలని యోచిస్తున్నారు. 2030కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. జపాన్‌లో డ్రైవర్ల కొరత ఉంది. కాలుష్యం బాగా పెరుగుతూపోతోంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకే  ఆటోమేటిక్‌ కార్గో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థను రెడీ చేస్తున్నారు.

Also Read :Yama Dwitiya 2024 : అపమృత్యు దోషం తొలగేందుకు యముడు చెప్పిన సీక్రెట్.. రేపే ‘యమ ద్వితీయ’

ఆటోమేటిక్‌ కార్గో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థ విశేషాలు

  • జపాన్‌లోని టోక్యో – ఒసాకా మార్గంలో ఆటోమేటిక్‌ కార్గో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థను  ఏర్పాటు చేయనున్నారు.
  • ఈ ప్రాజెక్టు కోసం ఇంకా నిధులను సేకరించాల్సి ఉంది.
  • ఈ ప్రాజెక్టులో భాగంగా రూట్‌లోని ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, పోర్టులను అనుసంధానం చేస్తూ ఫోర్క్ లిఫ్టులను నిర్మిస్తారు. వీటి ద్వారా సరుకులను రవాణా చేస్తారు.
  • ఆటోమేటిక్‌ కార్గో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థలోని కన్వేయర్ బెల్టుల ద్వారా సప్లై చేసే బాక్సుల సైజు విషయానికి వస్తే.. వాటి పొడవు 180 సెంటీమీటర్లు,  వెడల్పు 110 సెంటీమీటర్లు.
  • ఈ కన్వేయర్ బెల్టుల ద్వారా వ్యాపార సరుకులను, సామగ్రిని, వస్తువులను డెలివరీ చేయనున్నారు.
  • జపాన్ దేశ వార్షిక ట్రాన్స్‌పోర్ట్ కెపాసిటీ 4.3 బిలియన్ మెట్రిక్ టన్నులు. ఇందులో దాదాపు 91 శాతం  ట్రక్కుల ద్వారా జరుగుతోంది. అయితే ట్రక్కు డ్రైవర్ల కొరతతో సరుకుల  రవాణాలో జాప్యం జరుగుతోంది.
  • రోడ్డు ప్రమాదాలలో ఏటా ఎంతోమంది జపాన్ డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నారు.

Also Read :US Donation Race : ఎన్నికల విరాళాల రేసులో కమల టాప్.. డొనేషన్ల సేకరణకు రూల్స్ ఇవీ

  Last Updated: 02 Nov 2024, 02:00 PM IST