Site icon HashtagU Telugu

Japan Plane: మంటల్లో చిక్కుకున్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం.. ఐదుగురు సిబ్బంది మృతి, ప్రధాని విచారం..!

Japan Plane

Safeimagekit Resized Img 11zon (1)

Japan Plane: భూకంపంతో అతలాకుతలమైన జపాన్‌లో మంగళవారం (జనవరి 2) పెను ప్రమాదం సంభవించింది. టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఓ విమానం (Japan Plane) మంటల్లో చిక్కుకుంది. విమానంలో 350 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, వారంతా సురక్షితంగా ఉన్నారు. జపాన్‌కు చెందిన ఎన్‌హెచ్‌కె టీవీ కథనం ప్రకారం.. విమానాశ్రయంలో ప్రయాణీకుల విమానం కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొట్టింది. మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కోస్ట్ గార్డ్ విమానంలో ఉన్న ఐదుగురు సిబ్బంది మరణించారు. ఒక వ్యక్తి గాయపడ్డాడు.

విమానంలో ఉన్న 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చెప్పారని NHK TV పేర్కొంది. ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం, కలవరపరిచేది అని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా అన్నారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారని NHK TV తెలిపింది.

Also Read: Sharmila – Jagan : 3న జగన్‌ నివాసానికి షర్మిల.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి!

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. కోస్ట్ గార్డ్ విమానం జపాన్‌లో భూకంపం ప్రభావిత ప్రాంతాలకు వస్తువులను సరఫరా చేయడానికి వెళుతోంది. ఈ ప్రమాదానికి ఒక రోజు ముందు సోమవారం (జనవరి 1) జపాన్‌లోని ఇషికావా ప్రావిన్స్, పరిసర ప్రాంతాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక భూకంపాలు సంభవించాయి. వీటిలో గరిష్టంగా 7.6 తీవ్రత భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా కనీసం 30 మంది మరణించారు.

ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం టోక్యోలోని హనేడా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా ఇక్కడ ఉన్న కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టడం గమనించవచ్చు. దీని తరువాత అగ్నిప్రమాదం ప్రారంభమవుతుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తన తండ్రి, సోదరితో కలిసి ప్రయాణిస్తున్న స్వీడన్ ఆంటోన్ డీబే స్కాటిష్ వార్తాపత్రిక ఆఫ్టన్‌బ్లాడెట్‌తో మాట్లాడుతూ.. కొద్దిసేపటికే క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ డోర్లు తెరిచి బయటకు వచ్చాం అని చెప్పాడు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రమాదం ఎలా జరిగింది..?

కొత్త సంవత్సరం తర్వాత సెలవులు జరుపుకుని దేశానికి తిరిగి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. జపాన్ టైమ్స్ ప్రకారం.. హనేడా విమానాశ్రయం జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి.