Site icon HashtagU Telugu

Govt Dating App : గవర్నమెంట్ డేటింగ్ యాప్.. యువతకు లక్కీ ఛాన్స్

Govt Dating App Japan

Govt Dating App Japan

Govt Dating App : డేటింగ్ యాప్‌ను చూడటాన్ని ఓ పెద్ద అపరాధంగా పరిగణిస్తుంటారు.  డేటింగ్ యాప్స్‌ను చాలా సంప్రదాయక దేశాల్లో ఇప్పటికే బ్యాన్ కూడా చేశారు. అయితే జపాన్ సర్కారు ఇందుకు భిన్నంగా అడుగులు వేస్తోంది. సాక్షాత్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో డేటింగ్ యాప్‌ను(Govt Dating App) తీసుకురానుంది. ఇంతకీ ఎందుకిలా చేయనుంది  ? కారణం ఏమిటి ?

We’re now on WhatsApp. Click to Join

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ జపాన్‌. గత కొన్నేళ్లుగా ఆ దేశంలో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గిపోయింది. గత ఎనిమిదేళ్లుగా జపాన్ జననాల రేటు క్షీణిస్తోంది. ఈక్రమంలో దేశంలో జననాల రేటును పెంచేందుకు ఈ వేసవి సీజన్‌లో టోక్యో నగర పాలనా యంత్రాంగం ఒక డేటింగ్ యాప్‌ను రిలీజ్ చేయనుంది. ఈ డేటింగ్ యాప్‌కు సంబంధించిన సభ్యత్వం పొందాలని భావించేవారంతా తమ ఐడీ కార్డులను, ఇతర ఆధారాలను ప్రభుత్వ అధికారులకు సమర్పించాల్సి  ఉంటుంది. ప్రధానంగా తాము ఒంటరిగానే ఉన్నామని అధికారుల నుంచి  ధ్రువీకరణ పొందాలి. అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించి.. డేటింగ్ యాప్‌లో చేరనున్న వ్యక్తి  ఒంటరిగానే జీవిస్తున్నాడని వెల్లడించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే డేటింగ్ యాప్‌లో చేర్చే విషయంలో దరఖాస్తుదారుడి పేరును పరిశీలిస్తారు.

Also Read :World Leaders : మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచ దేశాధినేతలు

డేటింగ్ యాప్‌లో మంచి సంబంధం దొరికితే పెళ్లి చేసుకోవడానికి సుముఖంగానే ఉంటానని సంతకాలు చేసి ఒక లెటర్‌ను అధికారులకు దరఖాస్తుదారుడు ఇవ్వాల్సి ఉంటుంది.  ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ పేరు.. పొందుతున్న వార్షిక వేతనం.. నిజమే అని ధ్రువీకరించే అన్ని ప్రూఫ్స్‌ను అప్లికేషన్‌తో పాటు ఇవ్వాలి.  ఇక ప్రభుత్వానికి చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు కూడా సమర్పించాలి. ఇవన్నీ సంబంధిత ఉన్నతాధికారులు తనిఖీ చేసి.. నిజమేనని భావించాక.. డేటింగ్ యాప్‌లో సభ్యత్వం కల్పిస్తారు. ఈ డేటింగ్ యాప్‌లో చేరాక .. ఎవరితోనైనా సంబంధం బలపడితే డేటింగ్ చేయొచ్చు. ఇద్దరి మనసులు కలిస్తే.. పెళ్లి కూడా చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్నాక.. డేటింగ్ యాప్ నుంచి పేరును తొలగిస్తారు.

Also Read :JC Prabhakar reddy : తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ కు జేసీ రాజీనామా..

జపాన్‌లో పెళ్లిళ్ల సంఖ్య 90 గత ఏళ్లకాలంలో తొలిసారిగా గత సంవత్సరం 5 లక్షల దిగువకు పడిపోయింది. గత సంవత్సరం జపాన్‌లో జరిగిన వివాహాల సంఖ్య కేవలం 4,89,281. త్వరలో తీసుకురాబోయే ప్రభుత్వ డేటింగ్ యాప్ వల్ల పెళ్లిళ్ల సంఖ్య పెరుగుతుందని జపాన్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.  ఇక ఈ ప్రయత్నాన్ని అమెరికా కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్‌ ప్రశంసించారు. ఈ అంశం ప్రాముఖ్యతను జపాన్ ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకపోతే, జపాన్‌ వంటి దేశాలు అదృశ్యమవుతాయని మస్క్ కామెంట్ చేశారు.