Japan On Moon : జపాన్ సక్సెస్.. చంద్రుడిపై దిగిన ల్యాండర్.. ఆ ప్రాబ్లమ్‌తో టెన్షన్

Japan On Moon : అమెరికా, రష్యా, చైనా, భారతదేశం తర్వాత చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది.

  • Written By:
  • Updated On - January 20, 2024 / 02:18 PM IST

Japan On Moon : అమెరికా, రష్యా, చైనా, భారతదేశం తర్వాత చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్‌ను సక్సెస్ ‌ఫుల్‌గా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది. జపాన్ ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ ‘మూన్ స్నైపర్’  శనివారం అర్ధరాత్రి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. చంద్రుడిపై జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ లక్ష్యంగా  ఎంచుకున్న ప్రదేశానికి  100 మీటర్ల (328 అడుగులు) దూరంలో ల్యాండర్ SLIM అడుగు పెట్టింది. SLIM అంటే.. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. SLIM పనితీరు ఎలా ఉంది ? అది జాబిల్లిపై(Japan On Moon) ఏమేం చేస్తోంది ?  అనే వివరాలు తెలియాలంటే మరో నెల టైం పడుతుందని జపాన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ SLIM దిగేటప్పుడు కొన్ని కుదుపులకు గురైనట్లు తెలుస్తోంది. బహుశా దాని ప్రభావం వల్లే ల్యాండర్‌పై తాము అమర్చిన సోలార్ ప్యానెల్స్ ప్రస్తుతానికి పనిచేయడం లేదని జపాన్ స్పేస్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.  సోలార్ ప్యానెల్స్ ద్వారా ప్రస్తుతానికి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని, అంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇలా ఎందుకు జరిగిందనే కారణాలను అన్వేషించే పనిలోనే తాము ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ల్యాండర్‌లో ఉన్న బ్యాటరీల నుంచి శక్తి అందుతోందని.. అయితే అది కొన్ని రోజులకు మాత్రమే సరిపోతుందన్నారు. నేడో, రేపో సోలార్ ప్యానెల్స్ పనిచేయడం ప్రారంభిస్తాయని జపాన్ స్పేస్ ఏజెన్సీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుడి కోణం మారిన తర్వాత చంద్రుడిపై పగటిపూట దాదాపు 100 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్ నమోదవుతుందని, ల్యాండర్‌పై ఉన్న సోలార్ ప్యానెల్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అంతమాత్రం ఎండ సరిపోతుందని తెలిపారు. దాదాపు రెండు, మూడుసార్లు వాయిదాలు, వైఫల్యాలు ఎదురైనా పట్టుదలతో ఎట్టకేలకు చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్‌ను జపాన్ ల్యాండ్ చేయించడం స్ఫూర్తిదాయకం.

Also Read: Reliance Industries : 22న దేశవ్యాప్తంగా ఉద్యోగులకు సెలవు.. ప్రకటించిన రిలయన్స్

‘చంద్రయాన్ 3’ నుంచి మళ్లీ సిగ్నల్స్

‘చంద్రయాన్ 3’.. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్‌ పేరు సువర్ణాక్షరాలతో లిఖించేలా చేసిన ప్రయోగం. ‘చంద్రయాన్ 3’ ప్రయోగంలో భాగంగా ల్యాండర్ విక్రమ్, రోవర్  ప్రజ్ఞాన్‌లు గతేడాది ఆగస్ట్‌ 23 నుంచి 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు చేశాయి. ఆ తర్వాత జాబిల్లిపై చీకటి కావడంతో ల్యాండర్, రోవర్‌లను ఇస్రో స్లీప్‌మోడ్‌లోకి పంపించింది. దక్షిణ ధ్రువం వద్ద ప్రస్తుతం స్లీప్‌ మోడ్‌లో ఉన్న చంద్రయాన్‌ 3 ల్యాండర్ నుంచి తాజాగా సిగ్నల్స్ వచ్చాయని ఇస్రో వెల్లడించింది.  ప్రస్తుతం తాము ల్యాండర్‌లోని పరికరాల లొకేషన్లను గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. చంద్రయాన్‌ 3 ల్యాండర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన లూనార్‌ రికనిసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ) ఉంది. ఆ లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్‌లోని లేజర్‌ రెట్రో రెఫ్లెక్టర్‌ ఎరే (ఎల్‌ఆర్‌ఏ).. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని లొకేషన్‌ మార్కర్‌ సేవలను పునరుద్ధరించిందని ఇస్రో(Chandrayaan 3) శాస్త్రవేత్తలు చెప్పారు.