Pakistan New Party : ఒక బిలియనీర్ రాజకీయం.. ఇమ్రాన్ పార్టీ రెబల్స్ తో కొత్త పార్టీ

Pakistan New Party  : పాకిస్తాన్ లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ "పాకిస్తాన్ తెహ్రీక్-ఏ -ఇన్సాఫ్" (పీటీఐ)లోని తిరుగుబాటు నేతలు ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త జహంగీర్ ఖాన్ తరీన్ (జేకేటీ)తో చేతులు కలిపి కొత్త పొలిటికల్ పార్టీని నెలకొల్పేందుకు రెడీ అయ్యారు.

  • Written By:
  • Updated On - June 3, 2023 / 07:54 AM IST

Pakistan New Party  : పాకిస్తాన్ లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోంది.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ “పాకిస్తాన్ తెహ్రీక్-ఏ -ఇన్సాఫ్” (పీటీఐ)లోని తిరుగుబాటు నేతలు ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త జహంగీర్ ఖాన్ తరీన్ (జేకేటీ)తో చేతులు కలిపి కొత్త పొలిటికల్ పార్టీని నెలకొల్పేందుకు రెడీ అయ్యారు.

దీనిపై ఇవాళో..  రేపో.. అధికారిక ప్రకటన రానుంది.

జహంగీర్ తరీన్ గతంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీలో సెక్రటరీ జనరల్ గా పనిచేశారు. జహంగీర్ తరీన్ తో పాటు అలీమ్ ఖాన్, ఆన్ చౌదరి అనే ముగ్గురు నేతలు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పెట్టిన కొత్తలో అత్యంత కీలక హోదాలో ఉండేవారు. అయితే ఇమ్రాన్ ప్రధాని అయ్యాక.. పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు.  మిగితా నాయకుల యాక్టివిటీని పరిమితం చేశారు. ఈక్రమంలోనే జహంగీర్ తరీన్, అలీమ్ ఖాన్, ఆన్ చౌదరిలను తన పార్టీ నుంచి బహిష్కరించారు. వారిపై అనేక ఫేక్ కేసులు కూడా పెట్టించాడని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆనాడు ఇమ్రాన్ ఖాన్ తో ఏర్పడిన రాజకీయ విరోధానికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఇదేనని భావించిన జహంగీర్ తరీన్, అలీమ్ ఖాన్, ఆన్ చౌదరి.. ఇప్పుడు ఇమ్రాన్ పార్టీలోని అసమ్మతి నేతలను చేరదీసి కొత్త పార్టీ పెడుతున్నారు. దీనిపై శుక్రవారం రోజే పాక్ ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు కూడా చేశారని అంటున్నారు. అయితే పార్టీకి  ఏ పేరు పెడితే బాగుంటుంది అనే దానిపై  జహంగీర్ తరీన్  ఇంకా క్లారిటీకి రాలేదట. ప్రభుత్వ వేధింపులు, అరెస్టుల నేపథ్యంలో  ఇమ్రాన్‌ రాజకీయ పార్టీ పీటీఐకి చెందిన 100 మందికి పైగా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వారిలో సాధ్యమైనంత ఎక్కువ మందిని తాను పెట్టబోయే పార్టీలో(Pakistan New Party) చేర్చుకోవాలని జహంగీర్ తరీన్  ప్లాన్ చేస్తున్నారు.

Also read : Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ.. షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..!

ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లకు పారిపోయిన ఇమ్రాన్ అనుచరులు 

మీడియా నివేదికల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్‌కు చాలా సన్నిహితంగా ఉండే పలువురు నాయకులు అరెస్టు భయంతో సరిహద్దు దాటి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లకు వెళ్లిపోయారు. ఇమ్రాన్‌కు కుడి భుజంగా పేరొందిన మురాద్ సయీద్ ఆచూకీని కాబూల్‌లో గుర్తించారు. ఇమ్రాన్ మరో సన్నిహితుడు జుల్ఫీ బుఖారీ బలూచిస్థాన్ మీదుగా ఇరాన్‌కు పారిపోయాడని చెప్పుకుంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్‌లకు చేరుకుని..  అక్కడి నుంచి విమానాలు ఎక్కి యూరప్ దేశాలకు వారు వెళ్తారనే టాక్ నడుస్తోంది.