Jack Ma: చైనీస్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా అనూహ్యంగా పాకిస్థాన్‌లో పర్యటించడం ఆసక్తి రేపుతోంది. జూన్ 29న జాక్ మా లాహోర్‌కు చేరుకుని 23 గంటలపాటు బస చేశారు. ఈ పర్యటనపై జాక్ మా ప్రభుత్వ అధికారులు నోరు మెదపడంలేదు. మీడియాకి కూడా దూరంగా ఉంటున్నారు. జెట్ ఏవియేషన్ యాజమాన్యంలోని VP-CMA పేరుతో రిజిస్టర్ చేయబడిన ప్రైవేట్ జెట్ ద్వారా జూన్ 30న తిరిగి చైనాకు చేరుకున్నారు. ఈ పర్యటనపై గోప్యత పాటిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో దాని సానుకూల ఫలితాలు పాకిస్తాన్ లో కనిపిస్తాయని భావిస్తున్నారు
జాక్ మాతో పాటు ఐదుగురు చైనా అధికారులు, ఒక డెన్మార్క్ జాతీయులు మరియు ఒక అమెరికన్ జాతీయుడు సహా ఏడుగురు వ్యాపారవేత్తలతో కూడిన ప్రతినిధి బృందం పాకిస్థాన్ పర్యటనలో పాల్గొన్నది. హాంకాంగ్‌లోని కమర్షియల్ ఏవియేషన్ సెక్టార్ నుంచి చార్టెడ్ విమానంలో నేపాల్ నుంచి పాకిస్థాన్ చేరుకున్నారు.
Read More: Drone Flying-Pm Modis House : ప్రధాని మోడీ నివాసంపై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు ?