Jack Dorsey : ట్విట్టర్ ప్రత్యామ్నాయం రెడీ అవుతోంది.. Twitter సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్ డోర్సే ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చాక కొత్త ఆల్టర్నేటివ్ సోషల్ మీడియా యాప్ ను డెవలప్ చేశారు. దానిపేరే “Bluesky” (బ్లూ స్కై). తాజాగా బ్లూ స్కై యాప్ Android వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ముందు ఫిబ్రవరి నెలాఖరులోనే iOS వినియోగదారులకు బ్లూ స్కై యాప్ ప్రారంభించబడింది.
క్లోజ్డ్ బీటా వర్షన్ లోనూ ఈ యాప్ వినియోగంలోకి రావడం ఈ యాప్ కు డిమాండ్‌ను పెంచుతోంది. గత రెండు వారాలుగా బ్లూ స్కై యాప్ కు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు దీని వినియోగదారుల సంఖ్య దాదాపు 20,000 ఉంది. యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ “data.ai” ప్రకారం.. బ్లూ స్కై iOS వర్షన్ యాప్ ను ఇప్పటివరకు 240,000 మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. వీటిలో 1,35,000 ఇన్‌స్టాలింగ్స్ ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు జరిగాయి. మార్చి నెలలో 97,000 మంది మాత్రమే బ్లూ స్కై యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నారు. మార్చి నెలలో పోలిస్తే ఏప్రిల్ లో 39% ఎక్కువగా బ్లూస్కై యాప్ ఇన్ స్టాలింగ్స్ జరిగాయి. గత సంవత్సరమే బ్లూస్కై యాప్ అభివృద్ధికి రూ.100 కోట్ల పెట్టుబడి లభించింది. ఈ నిధులతోనే యాప్ కు సంబంధించిన R&D వర్క్ జరుగుతోంది.
■ బ్లూ స్కై యాప్‌లోని ఫీచర్ల గురించి ఓసారి తెలుసుకుందాం..
★ ఈ యాప్ సరళీకృతమైన వినియోగదారు ఇంటర్ ఫేస్‌ను అందిస్తుంది.
★ ఇందులో దాదాపు 256 అక్షరాలతో పోస్ట్‌ను క్రియేట్ చేయొచ్చు. అలాగే ఫొటోలు ఉంటాయి.
★ బ్లూస్కై వినియోగదారులు తమ ఖాతాలను ఇతరులతో భాగస్వామ్యం చేయవచ్చు. మ్యూట్ చేయవచ్చు. బ్లాక్ కూడా చేయవచ్చు.
★ యాప్ నావిగేషన్ దిగువన మధ్యలో ఉన్న డిస్కవర్ ట్యాబ్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎవరు మనల్ని అనుసరించాలి అనే సూచనలను ఇస్తుంది.
★ముఖ్యంగా ట్విట్టర్ లాగా లైక్‌లు, రీపోస్ట్‌లు, ఫాలోలు, ప్రత్యుత్తరాలతో సహా మీ నోటిఫికేషన్‌లను తనిఖీ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
★మీరు ట్విట్టర్ యాప్‌లోలా ఇతర వ్యక్తుల కోసం శోధించవచ్చు.. అనుసరించ వచ్చు.. ఆపై వారి నవీకరణలను హోమ్ టైమ్‌లైన్‌లో కూడా చూడవచ్చు.
★వినియోగదారుల ప్రొఫైల్‌లు ప్రొఫైల్ పిక్, బ్యాక్‌గ్రౌండ్, బయో, మెట్రిక్ వంటి ఫీచర్లు కలిగి ఉంటాయి.
★ట్విట్టర్ మాదిరే ఈ యాప్ కు కూడా బ్లూ రంగును అద్దారు జాక్ డోర్సే.
★ డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్రోటోకాల్ గా దీన్ని డిజైన్ చేశారు.