Resigning As New Zealand PM: ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న న్యూజిలాండ్‌ PM

వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ (Jacinda Ardern) ప్రకటించారు. లేబర్‌ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22న ఓటింగ్‌ జరుగుతుందని చెప్పారు.

  • Written By:
  • Publish Date - January 19, 2023 / 09:30 AM IST

వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ (Jacinda Ardern) ప్రకటించారు. లేబర్‌ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22న ఓటింగ్‌ జరుగుతుందని చెప్పారు. సాధారణ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్‌ 14న జరుగుతాయని తెలిపారు. దీంతో ఆర్డెర్న్‌ పదవీ కాలం ఫిబ్రవరి 7 తర్వాత ముగియనుంది.

న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన రాజీనామాను ప్రకటించి ఆశ్చర్యపరిచారు. పార్టీ వార్షిక కాకస్ సమావేశంలో జెసిండా మాట్లాడుతూ.. తనకు ఇకపై నటించే శక్తి లేదని అన్నారు. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది. ఈ పనిలో ఎంత కష్టపడాలో నాకు తెలుసు. ఈ బాధ్యతను నెరవేర్చేంత శక్తి నా దగ్గర లేదని నాకు తెలుసని పేర్కొన్నారు. ప్రధానిగా జెసిండా పదవీకాలం ఫిబ్రవరి 7తో ముగియనుంది. జెసిండా మాట్లాడుతూ.. నేనూ మనిషినే, రాజకీయ నాయకులు కూడా మనుషులే అన్నారు. మేము చేయగలిగినప్పుడు చేయగలిగినదంతా చేస్తాము. వేసవి విరామంలో నేను ఈ పాత్రలో కొనసాగడానికి నాకు శక్తి ఉందా లేదా అని ఆలోచించాను. శక్తి లేదని నిర్ధారించాను.ఇవి నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైన ఐదున్నరేళ్లు అని జెసిండా చెప్పారు. న్యూజిలాండ్‌లో అక్టోబర్ 14న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆర్డెర్న్ వయసు 42 సంవత్సరాలు. ఆమె 2017లో 37 ఏళ్ల వయసులో న్యూజిలాండ్‌కు అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రి అయ్యారు.

Also Read: Assembly Elections 2023: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..!

2017లో జెసిండా ఆర్డెర్న్‌ తొలిసారిగా న్యూజిలాండ్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. మూడేండ్ల తర్వాత 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలో లేబర్‌ పార్టీ సాధారణ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే అనుకున్నంతగా రాణించలేకపోయింది. 49 శాతం ఓట్లతో మొత్తం 120 సీట్లకు గాను 64 స్థానాల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించింది. అయితే దేశంలో కోవిడ్‌ను సరిగా కట్టడి చేయలేకపోవడం, ఆర్థిక మందగమనం వంటి పరిస్థితుల్లో ఆమె నాయకత్వ పటిమపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడింది. దీంతో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఓటమి చవిచూసింది. దీంతో తాను మరింతకాలం ప్రధాని పదవిలో కొనసాగలేనని ఆమె ప్రకటించారు.