Two Trains Collide: ఇటలీలో తప్పిన పెను ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ, 17 మందికి గాయాలు..!

ఆదివారం అర్థరాత్రి రెండు రైళ్లు ప్రమాదానికి (Two Trains Collide) గురయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

  • Written By:
  • Updated On - December 11, 2023 / 07:39 PM IST

Two Trains Collide: ఆదివారం అర్థరాత్రి రెండు రైళ్లు ప్రమాదానికి (Two Trains Collide) గురయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం కారణంగా కనీసం 17 మంది గాయపడ్డారు. ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ఈ ప్రమాదం ఉత్తర ఇటలీలో ఆదివారం అర్థరాత్రి రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయని AFP వార్తా సంస్థ నివేదించింది. ఇటలీలో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు.

బోలోగ్నా-రిమిని మధ్య లైన్‌లో హై స్పీడ్ రైలు, ప్రాంతీయ రైలు ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రైలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Dark Circles : డార్క్ సర్కిల్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఆహారం కచ్చితంగా తీసుకోవాల్సిందే..

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి రైలు ఆపరేటర్లకు సమాచారం అందించారు. వీరిలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని అగ్నిమాపక సిబ్బంది, రైలు ఆపరేటర్‌లు తెలిపారు. అందుతున్న సమాచారం ప్రకారం.. బోలోగ్నా- రిమిని మధ్య లైన్‌లో హై-స్పీడ్ రైలు, ప్రాంతీయ రైలు మధ్య ప్రమాదం జరిగింది. వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. 17 మంది గాయపడినట్లు అగ్నిమాపక సిబ్బంది, రైలు ఆపరేటర్లు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే వారికి పెద్దగా గాయాలు కాలేదు. అదే సమయంలో జాతీయ రైలు ఆపరేటర్ ట్రెనిటాలియా ప్రతినిధి AFP ఏజెన్సీతో మాట్లాడుతూ.. ప్రజలకు “చిన్న గాయాలు” మాత్రమే ఉన్నాయని, అందువల్ల చాలా మందిని ప్రథమ చికిత్స తర్వాత ఇంటికి పంపారని తెలిపారు. అతి తక్కువ వేగంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. అయితే ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.