Site icon HashtagU Telugu

Italy: ఆ టూరిజం ప్లేస్ లో ఫోటోలు దిగడం నిషేధం.. ఎందుకో తెలుసా?

Italy

Italy

సాధారణంగా వేసవికాలం వచ్చింది అంటే చాలు పిల్లలకు హాలిడేస్ రావడంతో ఎక్కువగా వెకేషన్ లకు వెళ్లడానికి విహారయాత్రలకు వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. విహారయాత్రలకు వెళ్ళాము అంటే ఫోటోలు దిగడం అన్నది కామన్. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వాటిని గుర్తుంచుకోవడం కోసం ఫోటోలు దిగుతూ ఉంటాం. కొన్ని పర్యాటక ప్రాంతాలలో ఫోటోలు దిగరాదు అని బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇటలీలోని ఫోర్టోఫినో కూడా ఒకటి.

ఒకవేళ మీరు ఇటలీలో ఫోర్టోఫినో కి వెళ్లాలి అనుకుంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఆ ప్రదేశంలోకి వెళ్ళిన పర్యటకులు ఫోటోలు దిగకూడదు. ఇటీవలే ఆ పట్టణం అటువంటి నిబంధనలను విధించింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఇటలీ లోని సుందరమైన ప్రదేశాలలో ఫోర్టోఫినో కూడా ఒకటి. అక్కడ జనాభా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కేవలం 500 మంది మాత్రమే అక్కడ జనాభా నివసిస్తూ ఉంటారు. కానీ నిత్యం అక్కడికి పర్యటకులు వేలాదిమంది వస్తూ ఉంటారు. వేసవి కాలంలో మరింత ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అదే అక్కడ అందమైన ప్రదేశాలలో సెల్ఫీలు ఫోటోలు దిగడం కోసం ఎక్కువ మంది గుంపులు గుంపులుగా ఉంటారు.

అయితే ఆ రద్దీని తగ్గించడం కోసం ఆ పట్టణం ఇటీవల కొన్ని నిబంధనలు విధించింది. పర్యటకులు ఎవరు సెల్ఫీలు దిగకుండా నో వెయిటింగ్ జోన్ ను ప్రవేశపెట్టింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారు 275 యూరోలు చెల్లించాలి. ఇటీవలే అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:00 వరకు వర్తిస్తాయి. ఈ నియమాలు ఈ ఏడాది అక్టోబర్ వరకు అమలులో ఉండనున్నాయి. ఫోర్టోఫినో కి వచ్చిన పర్యటకులు ఒకే చోట ఎక్కువమంది గుమిగూడి ఉండడం వల్ల వీధుల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతుందని అందుకే అటువంటి నిబంధనలు విధించాల్సి వచ్చింది అని ఫోర్టోఫినో నియర్ మాటియో వయాకావా తెలిపారు.