Site icon HashtagU Telugu

Italian MP: పార్లమెంట్‌లో బిడ్డకు పాలిచ్చిన మహిళా ఎంపీ.. వీడియో వైరల్..!

Italian MP

Resizeimagesize (1280 X 720)

Italian MP: ఇటలీ పార్లమెంట్‌లో బుధవారం (జూన్ 7) తొలిసారిగా ఓ మహిళా ఎంపీ (Italian MP) చిన్నారికి పాలు ఇచ్చారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఇటాలియన్ మహిళా ఎంపీ (Italian MP) గిల్డా స్పోర్టియెల్లో ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో తన కొడుకు ఫెడెరికోకు పాలిచ్చారు. అనంతరం ఆమె నిర్ణయాన్ని ఎంపీలందరూ చప్పట్లతో స్వాగతించారు. దీంతో పాటు పలువురి ప్రశంసలు కూడా మహిళా ఎంపీ అందుకుంది.

చాలా దేశాల్లో తల్లిపాలు ఇవ్వడం సాధారణం. అయితే.. ఇటలీ వంటి పురుషాధిక్య దేశంలో దిగువ సభ సభ్యురాలు బిడ్డకు పాలు పట్టడం ఇదే తొలిసారి. పార్లమెంటరీ సమావేశానికి అధ్యక్షత వహించిన జార్జియో మ్యూల్ మాట్లాడుతూ.. అన్ని పార్టీల మద్దతుతో ఒక మహిళ తన బిడ్డకు పాలివ్వడం ఇదే తొలిసారి అని అన్నారు. పార్లమెంటులో తల్లిపాలను అనుమతించే చట్టం 2019లో ప్రవేశపెట్టబడింది. దీనిని ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ప్రతిపాదించారు.

ఇటలీ ఎంపీ గిల్డా స్పోర్టియెల్లో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇటలీ పార్లమెంట్‌లో తన బిడ్డకు పాలిచ్చిన తొలి రాజకీయ నాయకురాలిగా ఆమె నిలిచారు. 36 ఏళ్ల ఎంపీ తన రెండు నెలల కొడుకు ఫ్రెడెరికోకు నిండు పార్లమెంట్‌లోని ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో పాలు పట్టించారు. ఆమె సాహసోపేతమైన చర్యను పార్లమెంటు మొత్తం ప్రశంసించింది. ఆమె ఈ అడుగు ఇటలీ రాజకీయ చరిత్రలో కొత్త దశ.

Also Read: WTC Final Day 2: రెండోరోజూ ఆసీస్ దే.. బ్యాట్లెత్తేసిన భారత్ స్టార్ ప్లేయర్స్..!

పిల్లలకు తల్లిపాలు పట్టవచ్చు

ఇటలీలోని కొత్త పార్లమెంటరీ నిబంధనల ప్రకారం.. మహిళా ఎంపీలు ఒక సంవత్సరం లోపు తమ పిల్లలను ఛాంబర్‌లోకి తీసుకురావచ్చు. అక్కడ తల్లిపాలు కూడా ఇవ్వవచ్చు. ఇతర దేశాల్లో ఇంతకుముందు కూడా పార్లమెంటులో ఇలాంటి దృశ్యం కనిపించింది. మహిళా రాజకీయ నాయకులు పార్లమెంటులో లేదా బహిరంగ సభల మధ్యలో ఎటువంటి సంకోచం లేకుండా బహిరంగంగా తమ శిశువులకు పాలు ఇస్తున్నారు. ఇటలీలో పురుషాధిక్య రాజకీయాల కారణంగా ఇది సాధ్యం కాలేదు. ఇక్కడి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మంది పురుషులే.

మహిళలకు తల్లిపాలు ఇచ్చే స్వేచ్ఛ

స్పోర్టియెల్లో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్న న్యాయవాది. పని చేసే తల్లులకు అనుకూలంగా రూపొందించిన విధానాలకు ఆమె ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది. స్పోర్టియెల్లో చర్యకు ఆమె సహచర ఎంపీలు చప్పట్లు కొట్టారు. పార్లమెంటరీ సెషన్ అధ్యక్షుడు జార్జియో ముయెల్.. “అన్ని పార్టీలు కలిసి ఒక సమస్యకు మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఫ్రెడరికో సుదీర్ఘమైన, స్వేచ్ఛా, సంతోషకరమైన శాంతియుత జీవితాన్ని గడపాలని శుభాకాంక్షలు” అని వ్యాఖ్యానించారు.

పార్లమెంటులో తల్లిపాలను అనుమతించే చట్టం 2019లో ప్రవేశపెట్టబడింది. దీనిని ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ప్రతిపాదించారు. ఇటలీ రాజకీయాల్లో మైలురాయిగా నిలిచిన మెలోని గత అక్టోబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. అదే సంవత్సరం నవంబర్‌లో పలాజో మాంటెసిటోరియోలోని పార్లమెంట్ భవనాల్లో ప్రత్యేకంగా తల్లిపాలు ఇచ్చే గదిని ప్రారంభించారు.