ఇస్రో చేపట్టిన మానవ సహిత అంతరిక్ష ప్రయోగం “SpaceX’s Ax-4 Mission ” మిషన్ మరోసారి వాయిదా (Postponed) పడింది. ఇది ఇప్పటికే రెండోసారి వాయిదా పడిన సందర్భం కావడం గమనార్హం. మంగళవారం జరగాల్సిన ఈ ప్రయోగాన్ని బుధవారానికి వాయిదా వేసినట్టు ఇస్రో ప్రకటించింది. అయితే తాజాగా మరోసారి సమస్య తలెత్తడంతో, మిషన్‌ను మరింత ఆలస్యం చేయాల్సి వచ్చిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వీ. నారాయణన్ వెల్లడించారు. స్పేస్ ఎక్స్ సంస్థతో భాగస్వామ్యంగా చేపట్టిన ఈ మిషన్ కోసం అన్ని సాంకేతిక సన్నాహాలు పూర్తయ్యినప్పటికీ, ప్రయోగానికి ముందు తలెత్తిన లీకేజ్ కారణంగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
Sakshi Office : ఏలూరు సాక్షి ఆఫీస్ లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదు – డీఎస్పీ క్లారిటీ
ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఫాల్కన్ 9 రాకెట్‌లో ప్రయోగానికి ముందు హాట్ టెస్ట్ నిర్వహించగా, ప్రొపల్షన్ బేలో లోక్సీ (లిక్విడ్ ఆక్సిజన్) లీకేజ్ చోటు చేసుకుంది. ఇది చిన్న సమస్య అయినప్పటికీ, అంతరిక్ష ప్రయోగాల్లో ఈ తరహా లోపాలు ప్రమాదానికి దారితీసే అవకాశం ఉండటంతో, ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిపుణులు నిర్ణయించారు. ఇస్రో, స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు కలిసి సమస్యను సకాలంలో గుర్తించి, మరల హాట్ టెస్ట్ నిర్వహించి సురక్షిత ప్రయోగానికి సన్నద్ధమవుతున్నారు.
ఈ ఆక్సియమ్-4 మిషన్‌లో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ప్రధాన వ్యోమగామిగా ఉన్నారు. ఆయనతో పాటు నాసాకు చెందిన పెగ్గీ విట్సన్, హంగేరీకి చెందిన స్లావోష్ ఉజ్నాన్స్‌కి, టిబోర్ కపు అనే అంతరిక్షగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రయాణించనున్నారు. భారత శాస్త్ర సాంకేతికత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ మిషన్ వాయిదా పడటంపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. త్వరలో మళ్లీ ప్రయోగానికి తగిన తేదీని ప్రకటించే అవకాశముందని ఇస్రో వర్గాలు తెలిపాయి.