Israel Vs Hamas : గాజా నుంచి ఆర్మీని వెనక్కి పిలిచేది లేదు : ఇజ్రాయెల్

Israel Vs Hamas : గాజా నుంచి తమ సైనిక బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ నో చెప్పింది.

  • Written By:
  • Updated On - May 6, 2024 / 09:54 AM IST

We’re now on WhatsApp. Click to Join

ఎవరు చెప్పినా వినం : నెతన్యాహు

‘‘యుద్ధాన్ని ఆపేదిలేదు. ఈవిషయంలో మేం అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గం. ఇజ్రాయెల్​ ఒంటరిగా నిలబడాల్సి వస్తే, ఒంటరిగానే నిలబడతాం’’ అని వార్షిక హోలోకాస్ట్​ స్మారక దినం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. జర్మనీ, దాని మిత్ర దేశాలు 60 లక్షల మంది యాదులను చంపిన ఘటనకు స్మారకంగా ఇజ్రాయెల్​లో ‘యోమ్​ హషోహ్’​ అనే దినోత్సవాన్ని జరుపుకుంటారు. ‘‘నేను ప్రపంచ దేశాల నాయకులకు ఒకటే చెప్పదల్చుకున్నాను. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఏ అంతర్జాతీయ వేదిక ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తనను తాను రక్షించుకోకుండా ఇజ్రాయెల్​ను ఆపలేవు’’ అని ఆయన పేర్కొన్నారు.

Also Read : Bernard Hill Dies: టైటానిక్ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి

ఖతర్ ప్రభుత్వానికి చెందిన అల్‌-జజీరా న్యూస్ ఛానల్‌పై ఇజ్రాయెల్ నిషేధం విధించింది.  హమాస్‌కు అనుకూలంగా వార్తలు ప్రసారం చేస్తున్నారనే అభియోగంతో ఇజ్రాయెల్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్​, హమాస్​ మధ్య జరుగుతున్న ఈ చర్చల్లో అమెరికా, ఈజిప్టుతో పాటు ఖతర్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

Also Read :EC Big Shock To Sajjala : సజ్జల కు భారీ షాక్ ఇచ్చిన ఈసీ