Gaza strikes: ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. గాజాలోని ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది.

Published By: HashtagU Telugu Desk
Gaza strikes

Whatsapp Image 2023 05 13 At 8.16.34 Am

Gaza strikes: ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. గాజాలోని ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ వారంలో తొలిసారిగా జెరూసలేం వైపు ఉగ్రవాదులు రాకెట్లు ప్రయోగించారు. కాగా ఇస్లామిక్ జిహాద్ అనే ఉగ్రవాద సంస్థ మంగళవారం నుంచి గురువారం రాత్రి వరకు 803 రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.

602 రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలో ల్యాండ్ అయ్యాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. ఈ సమయంలో 191 ఉగ్రవాద స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరో ఇస్లామిక్ జిహాద్ కమాండర్ మరణించాడు. అతడిని అయాద్ అల్-హస్నిగా గుర్తించారు. ఇంతకు ముందు ఐదుగురు టెర్రరిస్టు కమాండర్లు హతమయ్యారు.

సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని రెహోవోట్‌లో గురువారం రాకెట్ దాడిలో ఒక ఇజ్రాయెల్ పౌరుడు మరణించాడు మరియు ఏడుగురు గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read More: birth date & career plan : బర్త్ డేట్ చూసుకో.. కెరీర్ ప్లాన్ చేసుకో

  Last Updated: 13 May 2023, 08:18 AM IST