Site icon HashtagU Telugu

Israel : ఇజ్రాయెల్ మళ్లీ వార్ మోడ్ లో.. హౌతీ రెబల్స్‌పై తీవ్ర బాంబుదాడులు

Israel Attack

Israel Attack

Israel : ఇజ్రాయెల్ తన దృష్టిని పశ్చిమాసియా అడ్డదారుల వైపు మళ్లించింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహిస్తున్న ఉగ్రచర్యలు, జల మార్గాల్లో జరుగుతున్న రవాణా అంతరాయాలు.. ఇవన్నీ సహించరానివని స్పష్టం చేస్తూ, ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున ఓ భారీ మిలటరీ ఆపరేషన్‌కు తెరలేపింది. ఈ దాడిలో గెలాక్సీ లీడర్ అనే నౌకను టార్గెట్ చేయడం గమనార్హం. ఈ నౌకను 2023 నవంబర్‌లో హౌతీలు హైజాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నౌకపై ఏర్పాటు చేసిన రాడార్ వ్యవస్థల ద్వారా, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తూ వస్తున్నారు. ఈ నౌక హౌతీలకు ప్రాపంచిక సముద్ర రవాణాలో అస్త్రంగా మారింది.

Tahawwur Rana : ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో కీలక మలుపు..నేరం అంగీకరించిన తహవ్వూర్ రాణా…

ఇక తాజాగా, ఈ నౌకతో పాటు హోదీడా, సలీఫ్‌, రాస్ ఇసా ప్రాంతాల్లోని హౌతీ rebals నిర్వహిస్తున్న ఓడరేవులను, రాస్ కనాటిబ్ విద్యుత్ ప్లాంట్‌ను ఇజ్రాయెల్ మిలటరీ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులన్నింటిని ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఓడరేవుల నుంచి హౌతీలు ఇరాన్ ద్వారా ఆయుధాలు, డ్రోన్లు, క్షిపణులు పొందుతున్నారని ఆరోపించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో హౌతీలు కూడా రెచ్చిపోతున్నారు.

ఇప్పటికే ఆ దేశంపై క్షిపణులు ప్రయోగిస్తున్నట్లుగా సమాచారం. అయితే గెలాక్సీ లీడర్‌ను పేల్చడం, హౌతీల కీలక బేస్‌లను ధ్వంసం చేయడం ద్వారా ఈ రెబల్స్‌కు గట్టి సందేశం పంపినట్లైంది. ఈ దాడులపై అంతర్జాతీయంగా కూడా స్పందన వస్తోంది. ముఖ్యంగా రెడ్ సీలో వాణిజ్య రవాణా నౌకలకు భద్రత ప్రమాదంలో పడుతుండటంతో గల్ఫ్ దేశాలు, ఐక్యరాజ్యసమితి తదితర అంతర్జాతీయ సంస్థలు ఈ పరిణామాలపై క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి.

Rashmika : స్టార్డమ్ వెనుక బాధలు.. సెలవులు అనేవి కలలాగే..