Israel Hamas War: హమాస్ బందీలతో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ మరియు థాయ్‌లాండ్‌కు చెందిన 25 మంది బందీలను హమాస్ దళాలు విడుదల చేశాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం 13 మంది బందీల జాబితాను వివరించింది.హమాస్‌తో మార్పిడి ఒప్పందంలో భాగంగా గత ఏడు వారాలుగా గాజా స్ట్రిప్‌లో బందీలుగా ఉన్న 13 మంది ఇజ్రాయిలీలు మరియు 12 మంది థాయ్ జాతీయులతో సహా 25 మంది బందీలను హమాస్ దళాలు విడుదల చేశాయి.13 మంది ఇజ్రాయెల్‌లు రెడ్‌క్రాస్‌కు అప్పగించారు. వారు ఈజిప్టు మీదుగా ఇజ్రాయెల్‌కు తిరిగి వచ్చారు. ఈ స్థితిలో హమాస్ విడుదల చేసిన బందీల జాబితాను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం శనివారం ప్రచురించింది. విడుదలైన వారిలో 11 మంది విదేశీయులు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది.
Also Read: Rajasthan Assembly Polls: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 68.70 పోలింగ్ శాతం నమోదు..