Israel Vs Hamas : హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన ఇజ్రాయెల్‌కు చెందిన ఆరుగురు బందీల డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. పాలస్తీనాకు చెందిన దక్షిణ గాజాలోని రఫా ఏరియాలో ఉన్న హమాస్ సొరంగంలో ఈ డెడ్‌బాడీలు దొరికాయి. వీరిలో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. ఈవివరాలను ఇజ్రాయెల్ ఆర్మీ కూడా ధ్రువీకరించింది. మృతుల్లో ఒకరి పేరు హెర్ష్ గోల్డ్‌బర్గ్ పొలిన్. ఈయన 23 ఏళ్ల ఇజ్రాయెలీ-అమెరికన్. చనిపోయిన మిగతా వారిలో ఓరీ డానినో (25), ఎడెన్ యెరుషాల్మి (24), అల్మోగ్ సారుసి (27), అలెగ్జాండర్ లొబనోవ్ (33), కార్మెల్ గాట్ (40) ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇజ్రాయెల్ దళాలు(Israel Vs Hamas) రఫా ఏరియాలో ఉన్న ఆ టన్నెల్ వైపుగా వస్తున్నాయని తెలియడంతో.. ఆరుగురు ఇజ్రాయెలీ బందీలను హమాస్ మిలిటెంట్లు చంపేసి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. వీరిని గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ నుంచి హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. సొరంగంలో బంధించి నెలల తరబడిని వారిని చిత్రహింసలకు గురి చేసి ఉంటారని ఇజ్రాయెలీ ఆర్మీ ఆరోపిస్తోంది. వాస్తవానికి గతవారమే రఫా ప్రాంతంలో ఖైద్ ఫర్హాన్ అల్ ఖాదీ (52) అనే బందీని ఓ సొరంగం నుంచి ఇజ్రాయెలీ ఆర్మీ కాపాడింది. దీంతో మరింత మంది బందీలు అదే ఏరియాలోని సొరంగాల్లో ఉండొచ్చనే అనుమానంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది.
Also Read :Diktat For Employees : ఆఫీస్ టైంలో కాఫీకి వెళ్లొద్దు.. ఉద్యోగులకు కంపెనీ ఆర్డర్
దీంతో అలర్ట్ అయిన హమాస్ మిలిటెంట్లు.. ఆ సొరంగానికి కిలోమీటరు దూరంలోనే ఉన్న మరో సొరంగంలో దాచిన ఆరుగురు ఇజ్రాయెలీ బందీలను చంపేశారు. ఇజ్రాయెలీ బందీలు చనిపోయారనే వార్తపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ దురాగతాలకు పాల్పడినందుకు హమాస్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మిగతా బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య సత్వర ఒప్పందం కుదిరేలా కృషి చేస్తామని బైడెన్ తెలిపారు. కాగా, గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో 40,691 మంది సామాన్య పౌరులు చనిపోయారు.