Gaza Secret Tunnels : ఇజ్రాయెల్ నుంచి హమాస్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన 100 మంది యూదుల భద్రతపై ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది. ఆ 100 మంది ఇజ్రాయెలీ పౌరులను ఎక్కడికి తీసుకెళ్లారు ? ఎక్కడ బంధించారు ? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ఉన్నాయి. గాజా నగరంలో భూమి కింద నిర్మించుకున్న రహస్య టన్నెళ్లలోకి ఇజ్రాయెలీ బందీలను హమాస్ ఉగ్రమూకలు తీసుకెళ్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ టన్నెల్ నెట్‌వర్క్‌ను ఛేదించడం ఇజ్రాయెల్ ఆర్మీకి పెద్ద సవాల్ గా మారనుంది. గాజా ప్రాంతం హమాస్ ఆధీనంలోకి వెళ్లినప్పటి నుంచి కాంక్రీట్ తో అండర్‌గ్రౌండ్ బంకర్లను కట్టారు. యుద్ధవిమానాలు, ఉపగ్రహాలకు దొరకకుండా వీటిని కేమోఫ్లాజ్ టెక్నిక్‌తో కప్పిపెడుతున్నారు. ఈజిప్ట్ నుంచి హమాస్ కు ఆయుధాలు సప్లై అయ్యేది ఈ టన్నెల్ ల ద్వారానే అని (Gaza Secret Tunnels) చెబుతుంటారు.
We’re now on WhatsApp. Click to Join
గాజా పట్టణంలో దాదాపు 1,300కుపైగా రహస్య టన్నెల్ లు ఉన్నాయట. వీటికి సంబంధించిన ప్రవేశమార్గాలు స్కూల్స్, మసీదులు, ఆస్పత్రులు, ప్రభుత్వ భవనాల నుంచి ఉన్నాయని అంటారు. రెండేళ్ల క్రితం ఈ రహస్య టన్నెల్ లను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేసినా.. పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. ఒక వేళ సెస్మిక్, రాడార్లను వాడి ఈ సొరంగాలను గుర్తించినా.. లోపల ఉన్న మార్గం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో కచ్చితంగా తెలియని పరిస్థితి నెలకొంది. వీటిలో కొన్ని సొరంగాలు భూమి ఉపరితలానికి 65 అడుగుల కింద ఉన్నాయట. ప్రస్తుతం 100 మంది ఇజ్రాయెలీ బందీలను విడిపించాలంటే.. ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని రహస్య టన్నెల్స్ లక్ష్యంగా ప్రత్యేక ఆపరేషన్ ను మొదలుపెట్టాల్సిన అవసరం ఉంటుందని రక్షణ రంగ పరిశీలకులు (Gaza Secret Tunnels) అంటున్నారు.