100000 Indians – Israel : గాజాపై భీకరంగా వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన దాదాపు 1 లక్ష మందికి జాబ్స్ ఇవ్వాలని ఇజ్రాయెల్ సర్కారు నిర్ణయించింది. యుద్ధం జరుగుతున్న వేళ పాలస్తీనాకు చెందిన దాదాపు 90వేల మంది కార్మికులను ఇజ్రాయెల్ సర్కారు జాబ్స్ నుంచి తీసేసింది. వారికి ఇంతకుముందు మంజూరు చేసిన వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. దీంతో పాలస్తీనా కార్మికులంతా ఇజ్రాయెల్ నుంచి తమ దేశానికి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో ఇజ్రాయెల్‌లో తీవ్రంగా మానవ వనరుల కొరత ఏర్పడింది. ఈనేపథ్యంలో తమతో సన్నిహిత సంబంధాలను కలిగిన భారత్ నుంచి మానవ వనరులను రిక్రూట్ చేసుకోవాలని ఇజ్రాయెల్ సర్కారు డిసైడ్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇజ్రాయెల్‌లోని లేబర్ మార్కెట్ ప్రస్తుతం భారతీయ కార్మికులకు అనుకూలంగా ఉంది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని వ్యతిరేకిస్తూ ఇటీవల అరబ్ దేశాలు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ నిర్ణయంతో ఇజ్రాయెల్‌కు భారత్ చేరువైంది. ఇజ్రాయెల్ నాయకత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా భారత్ నడుచుకోవడం లేదనే సంకేతాలు వెళ్లాయి. ఈ పరిణామంతో ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను భారతీయులను భర్తీ చేయాలని నిర్ణయించారు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించిన అనంతరం స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ కాల్ చేసి సంఘీభావం తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్‌తోనే భారత్ ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటివరకు గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో దాదాపు 11వేల మంది సామాన్య పౌరులు చనిపోయారు. వారిలో దాదాపు 6వేల మంది పిల్లలు (100000 Indians – Israel) ఉన్నారు.