Israel Vs Gaza : ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గాలంట్ కీలక ప్రకటన చేశారు. గాజాపై హమాస్ నియంత్రణ కోల్పోయిందని, తాము పూర్తి పట్టు సాధించామని ఆయన వెల్లడించారు. గాజా నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇజ్రాయెల్ ఆర్మీని ఆపగలిగే శక్తి హమాస్‌కు లేదని యోవ్ గాలంట్ స్పష్టం చేశారు. గాజాలోని ప్రతిచోటా తమ సైన్యం ముందుకు సాగుతోందని తెలిపారు. హమాస్ ఉగ్రవాదులు ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు పారిపోతున్నారని ఆయన చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
గాజా పౌరులు హమాస్ స్థావరాలలోని నిత్యావసరాలను తీసుకుంటున్నారని, వారికి హమాస్ ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నారు. సోమవారం సాయంత్రం ఇజ్రాయెల్ సైన్యం గాజా సిటీలోని రాంటిసి హాస్పిటల్ వద్దకు వెళ్లగా.. హమాస్ కార్యకర్తలు అక్కడే కనిపించారని తెలిపారు. ఇజ్రాయెల్ బందీలను హాస్పిటళ్లలో హమాస్ బందీలుగా దాచిందని యోవ్ గాలంట్ వివరించారు. గాజాలోని హాస్పిటళ్ల కింద ఉన్న సొరంగాలలో హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సూసైడ్ బాంబ్ సామగ్రి, గ్రెనేడ్‌లు, ఏకే 47 రైఫిల్స్(Israel Vs Gaza) ఉన్నాయన్నారు.