Site icon HashtagU Telugu

Gaza : గాజా ప్రజలను ఇజ్రాయెల్ అటూఇటూ ఎందుకు తిప్పుతోంది ?

Gaza

Gaza

Gaza : 20 రోజుల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర గాజాలోని పాలస్తీనా పౌరులను దక్షిణ గాజాకు పంపింది. ఇప్పుడు(శనివారం) దక్షిణ గాజాలో ఉన్న పాలస్తీనా పౌరులను పశ్చిమ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఒక్కో ఏరియాకు గాజా ప్రజలను తిప్పుతూ వారి జీవితాలతో ఇజ్రాయెల్ ఆర్మీ చెలగాటం ఆడుతోంది. ‘ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోండి’ అని దక్షిణ గాజా ప్రజలకు వార్నింగ్ ఇస్తూ ఇవాళ ఉదయం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఖాన్ యూనిస్ నగరంలోకి జారవిడిచిన కరపత్రాలు చర్చనీ యాంశంగా మారాయి. ఆ కరపత్రాలను జారవిడిచిన కొన్ని గంటల్లోనే (శనివారం మధ్యాహ్నం) ఇజ్రాయెల్ ఆర్మీ ఖాన్ యూనిస్ నగరంపై భీకర వైమానిక దాడులు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

వైమానిక దాడులలో ఓ స్కూల్‌పై బాంబులు పడి పలువురు స్టూడెంట్స్ చనిపోయారు. కొందరు పెద్దలు కూడా చనిపోయారు. ఖాన్ యూనిస్ నగరంలోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడుల్లో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఉత్తర గాజాపై పట్టు సాధించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. ఇక దక్షిణ గాజాను అదుపులోకి తీసుకునే యత్నంలో ఉంది. ఇప్పుడు దక్షిణ గాజాకు చెందిన 4 లక్షల జనాభాలోని ఎంతోమంది పొట్టచేత పట్టుకొని పశ్చిమగాజాకు వలస వెళ్లిపోతున్నారు. త్వరలోనే పశ్చిమ గాజాపైనా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేేసే అవకాశం ఉంది.అంటే వారు అక్కడి నుంచి కూడా మరో చోటుకు వెళ్లిపోవాల్సి ఉంటుంది  మొత్తం మీద గాజా ప్రజలను గాజా నుంచి ఖాళీ చేయించి ఈజిప్టు లేదా జోర్డాన్‌లకు పంపాలనే ప్లాన్‌లో ఇజ్రాయెల్ ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గాజాలో యూదుల కోసం కాలనీలను నిర్మించాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోందనే అంచనాలు(Gaza) వెలువడుతున్నాయి.

Exit mobile version