Water Problem: ప్ర‌పంచ దేశాల్లోని ఈ న‌గ‌రాల్లో కూడా నీటి స‌మ‌స్య‌..?

ర్ణాటకలోని బెంగళూరు నగరం ప్రస్తుతం నీటి కొరత (Water Problem)తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

  • Written By:
  • Updated On - March 20, 2024 / 11:06 AM IST

Water Problem: కర్ణాటకలోని బెంగళూరు నగరం ప్రస్తుతం నీటి కొరత (Water Problem)తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 240 కోట్ల జనాభాతో సహా భారతదేశం నీటి కొరతను ఎదుర్కొంటోందని ఐక్యరాజ్యసమితి (UN) ఈ ఏడాది ప్రారంభంలో ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరులో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ప్రజలకు రోజుకి అవసరమైన నీటిలో మూడొంతులు పొందలేకపోతున్నారు.

సోమవారం (మార్చి 18) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. నగరానికి రోజుకు 2,600 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డి) నీరు అవసరమని, అయితే నగరానికి కేవలం 500 ఎంఎల్‌డి నీరు మాత్రమే సరఫరా అవుతోందన్నారు. భారత్‌తో సహా 25 దేశాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్యసమితి సంవత్సరం ప్రారంభంలోనే తెలియజేసింది. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వివిధ నగరాల్లో నీటి కొరతను అంచనా వేసింది. బెంగళూరు తర్వాత ఏయే నగరాలు తీవ్ర నీటి ఎద్దడి ముప్పులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కేప్ టౌన్

దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లో ఇప్పటికే నీటి కొరత ఏర్పడింది. 2017, 2018 సంవత్సరాల్లో ఇక్కడ ప్రమాదకరమైన నీటి ఎద్దడి పరిస్థితి కనిపించింది. అప్పట్లో ఇక్కడి నీటి సరఫరా డ్యాంలో 14 శాతం నీరు మాత్రమే మిగిలింది. ప్రస్తుతం 50 శాతం నీటిమట్టం ఉన్నప్పటికీ నగరానికి ప్రత్యేకించి వేసవి కాలంలో నీటి మట్టం ఇప్పటికీ సరిపోవడం లేదు.

కైరో

ఈజిప్ట్‌లో 97 శాతం నీటి వనరులు ఉన్నప్పటికీ ఆ దేశ రాజధాని కైరోలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం, నీటి కాలుష్యం వల్ల సంభవించే మరణాల సంఖ్య పరంగా ఈజిప్ట్ దిగువ మధ్య-ఆదాయ దేశాలలో మొదటి స్థానంలో ఉంది. 2025 నాటికి దేశంలో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఐరాస అంచనా వేసింది.

Also Read: Radhakrishnan : నేడు తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్

జకార్తా

ఇండోనేషియాలోని జకార్తా నగరం సముద్ర మట్టాలు పెరిగే ముప్పును ఎదుర్కొంటోంది. ఇక్కడ కోటి జనాభాలో సగం మంది పైపుల నీటిని వినియోగిస్తున్నారు. దేశంలో అనధికార బావుల తవ్వకం జరుగుతోంది. ఇది భూగర్భ జలాలు క్షీణతకు దారితీయవచ్చు. జకార్తాలో 40 శాతం సముద్ర మట్టానికి దిగువన ఉందని ఐరాస పేర్కొంది.

మెల్‌బోర్న్

దశాబ్ద కాలంగా నీటి కరువును ఎదుర్కొన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరం ఇప్పుడు అటవీ నిర్మూలనకు గురయ్యే ప్రమాదం ఉంది. అడవుల నరికివేత కారణంగా నగరం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుంది.

We’re now on WhatsApp : Click to Join

లండన్

యునైటెడ్ కింగ్‌డమ్ రాజధాని లండన్‌లో 2025 నాటికి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని, 2040 నాటికి ఈ సమస్య మరింత పెరిగి ప్రజలు పెద్ద ఎత్తున నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని గ్రేటర్ లండన్ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

WRI కూడా ఆందోళన వ్యక్తం చేసింది

ఆగస్ట్ 19, 2023న వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ అక్విడక్ట్ వాటర్ రిస్క్ అట్లాస్ నివేదిక ప్రకారం.. 25 దేశాలలో 400 కోట్ల జనాభా సంవత్సరానికి ఒక నెల నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఇది ప్రపంచ జనాభాలో దాదాపు సగం. 2050 నాటికి ఈ సంఖ్య 60 శాతానికి చేరుకోవచ్చని నివేదిక పేర్కొంది. బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్ ప్రతి సంవత్సరం అత్యధిక నీటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని, కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.