Facebook Story: ఫేస్‌బుక్ వెనుక ఇంత కథ ఉందా.. ముగ్గురితో మొద‌లైన సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫార‌మ్‌..!

ఈ రోజు ఆ వ్య‌క్తి సంపాదన భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల కంటే ఎక్కువ. ఫేస్‌బుక్ (Facebook Story) యజమాని మార్క్ జుకర్‌బర్గ్ అత్యంత సంప‌న్నుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు.

  • Written By:
  • Updated On - January 20, 2024 / 12:03 PM IST

Facebook Story: కేవలం 23 ఏళ్లకే బిలియనీర్‌గా మారిన వ్యక్తి కథను ఈ రోజు మ‌నం తెలుసుకుందాం. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యం కలిగించే వాస్తవం. కానీ, ఇది 100 శాతం నిజం. ఈ రోజు ఆ వ్య‌క్తి సంపాదన భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల కంటే ఎక్కువ. ఫేస్‌బుక్ (Facebook Story) యజమాని మార్క్ జుకర్‌బర్గ్ అత్యంత సంప‌న్నుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు.

ప్రపంచంలో 5వ అత్యంత సంపన్నుడు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఇప్పుడు బాగా పెరిగి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం జుకర్‌బర్గ్ వయసు 39 ఏళ్లు. అతను ఫిబ్రవరి 2004లో ఫేస్‌బుక్‌ని స్థాపించాడు. అప్పటికి అతని వయసు 19 ఏళ్లు మాత్రమే. అతను 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ అనే బిరుదును సాధించాడు.

గతేడాది 72 బిలియన్ డాలర్లు పెరిగింది

మార్క్ జుకర్‌బర్గ్ ప్రస్తుతం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు సీఈఓగా ఉన్నారు. గతేడాది ఆయన సంపద సుమారు 72 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ ఏడాది అతను దాదాపు 7.15 బిలియన్ డాలర్లు సంపాదించాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. జుకర్‌బర్గ్ మొత్తం సంపద $135 బిలియన్లకు చేరుకుంది.

Also Read: World’s Richest Family: ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం ఇదే.. రూ. 4000 కోట్ల విలువైన ప్యాలెస్‌లు, 700 కార్లు..!

ముగ్గురు స్నేహితులు కలిసి ఫేస్‌బుక్ స్థాపించారు

మే 14, 1984న న్యూయార్క్‌లోని వైట్ ప్లెయిన్స్‌లో జన్మించిన జుకర్‌బర్గ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి హార్వర్డ్ యూనివర్సిటీలోని ఓ గదిలో ఫేస్‌బుక్‌ను స్థాపించాడు. దీని తరువాత తక్కువ సమయంలో ఇది నిరంతరం ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా మారింది. అతను మే 2012లో ఫేస్‌బుక్‌ను పబ్లిక్ కంపెనీగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అదే అతిపెద్ద టెక్ IPO. 2022 సంవత్సరంలో కంపెనీ ఆదాయం $117 బిలియన్లు. అలాగే, దాని నెలవారీ వినియోగదారుల సంఖ్య 3.7 బిలియన్లకు చేరుకుంది.

మెటా ప్లాట్‌ఫారమ్‌లలో జుకర్‌బర్గ్ దాదాపు 13 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2004లో అతను వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థీల్ నుండి $5 లక్షల ఏంజెల్ పెట్టుబడిని అందుకున్నాడు. దీని తర్వాత, కంపెనీకి 2005లో ఫేస్‌బుక్ అనే పేరు వచ్చింది. అదే సంవత్సరంలో యాహూ ఫేస్‌బుక్‌ను $1 బిలియన్‌కు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. దీనిని జుకర్‌బర్గ్ తిరస్కరించారు.

We’re now on WhatsApp. Click to Join.

2014 సంవత్సరంలో కంపెనీ వాట్సాప్‌ను $19 బిలియన్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ పెద్ద ఒప్పందం గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి పెద్ద కంపెనీలను కూడా వెనక్కి నెట్టింది. 2021 సంవత్సరంలో కంపెనీ పేరు మెటా ప్లాట్‌ఫారమ్‌లుగా మార్చబడింది. Facebook, WhatsApp, Instagram వంటి ప్లాట్‌ఫారమ్‌లు Meta పరిధిలోకి వస్తాయి. వారి మార్కెట్ క్యాప్ 962.38 బిలియన్ డాలర్లు. మెటా ప్రస్తుతం ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద కంపెనీ.