Musk Dating Meloni: తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టెస్లా యజమాని ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని (Musk Dating Meloni)తో కనిపించారు. ఈ చిత్రాన్ని చూసిన జనాలు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారా అని సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తారు.
ఒక ఈవెంట్‌లో కలిసి కనిపించారు
మస్క్- మెలోని ఒక బ్లాక్-టై అవార్డుల కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా కనిపించారు. మస్క్ మెలోనికి “అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డు” ఇచ్చాడు. అలాంటి మహిళకు ఈ గౌరవం దక్కడం గర్వించదగ్గ విషయమన్నారు. మస్క్.. మెలోని అందం, ఆమె పనిని కూడా ప్రశంసించారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ప్రశంసించారు. ఈ ఈవెంట్‌లో ఇద్దరూ టేబుల్ దగ్గర కూర్చొని ఒకరినొకరు చూసుకున్నారు. దీంతో ఈ ఫొటోను ఇంటర్నెట్‌లో నెటిజన్లు వైరల్ చేశారు. చాలా మంది వినియోగదారులు వారిద్దరినీ పరిపూర్ణ జంట అని కూడా పిలిచారు. అయితే ఈ ఊహాగానాలకు మస్క్ తెరదించాడు.
Also Read: Wage Rates For Workers: దసరాకు ముందే కార్మికులకు పండగలాంటి న్యూస్ చెప్పిన కేంద్రం..!
Do you think They’ll date? 🤣 pic.twitter.com/XXs1U45kjb
— Tesla Owners Silicon Valley (@teslaownersSV) September 24, 2024
ఈ ఈవెంట్ తర్వాత మస్క్- మెలోనిలు డేటింగ్ చేస్తున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. దీనికి మస్క్ స్వయంగా సమాధానమిచ్చారు. ఒక టెస్లా ఫ్యాన్ క్లబ్ వారి ఫోటోను షేర్ చేసి వారు డేటింగ్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అని అంటే దీనిపై 53 ఏళ్ల బిలియనీర్ తాము డేటింగ్ చేయడం లేదని స్పష్టంగా చెప్పాడు.
మెలోనీ ఇటలీకి తొలి మహిళా ప్రధాని
జార్జియా మెలోనీ యూరోపియన్ యూనియన్‌కు బలమైన మద్దతు ఇవ్వడంతో పాటు ఇటలీకి మొదటి మహిళా ప్రధానమంత్రి అయినందుకు ఈ అవార్డును అందుకుంది. ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశానికి ఆమె హాజరవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎలాన్ మస్క్- జార్జియా మెలోని మధ్య రొమాంటిక్ రిలేషన్ షిప్ లేదని, అయితే వారి మధ్య స్నేహం ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తోంది.