North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ ఎక్కడ ఉన్నారు..? ఆయనకు ఏమైంది..?

ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. భారీ సైనిక కవాతుకు ముందు కిమ్ జాంగ్ అదృశ్యమైనట్లు సమాచారం. ఈ వారం ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో సైనిక కవాతు జరగనుంది. కిమ్ జోంగ్ దీనికి హాజరు కావాల్సి ఉంది.

  • Written By:
  • Publish Date - February 7, 2023 / 02:52 PM IST

ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. భారీ సైనిక కవాతుకు ముందు కిమ్ జాంగ్ అదృశ్యమైనట్లు సమాచారం. ఈ వారం ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో సైనిక కవాతు జరగనుంది. కిమ్ జోంగ్ దీనికి హాజరు కావాల్సి ఉంది. కానీ అతను గత 35 రోజులుగా కనిపించలేదు. ఆదివారం జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశానికి కూడా కిమ్ జోంగ్ హాజరుకాలేదని దక్షిణ కొరియా న్యూస్ పేర్కొంది. ఈ కీలక సమావేశానికి కిమ్ జోంగ్ ఉన్ గైర్హాజరు కావడం ఇది మూడోసారి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై చర్చ సాగుతోంది.

ఫిబ్రవరి 8న కొరియన్ పీపుల్స్ ఆర్మీ స్థాపించి 75 ఏళ్లు పూర్తి కానుంది. ఆ రోజున దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కిమ్ ఈ కవాతుకు హాజరవుతారా లేదా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. కిమ్ జోంగ్ అస్వస్థతకు గురయ్యారని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. అయితే, కొన్ని నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 8న జరిగే సైనిక కవాతుకు కిమ్ హాజరుకావచ్చు. ఆయన గైర్హాజరుపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వనందున ఈ వాదన వినిపిస్తోంది. ఈ కవాతుతో కిమ్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని అమెరికా, ఆసియాలోని దాని ఇతర మిత్రదేశాలకు చూపించనున్నారు. ఫాక్స్ న్యూస్ ప్రకారం.. గత వారం ఉత్తర కొరియా US మిలిటరీని అత్యంత భారీ అణుశక్తితో సరిపోల్చాలని బెదిరించింది.

Also Read: Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

ఉత్తర కొరియా 2022లో 70కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో అణ్వాయుధ సామర్థ్యం గల వార్‌హెడ్‌లు ఉన్నాయి. నివేదికల ప్రకారం.. ఈ క్షిపణులు దక్షిణ కొరియాలోని లక్ష్యాలపై దాడి చేయడానికి లేదా US ప్రధాన భూభాగాన్ని చేరుకోవడానికి రూపొందించబడ్డాయి. కిమ్ సైనిక చర్యపై అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాయి. కిమ్ జోంగ్ ఉన్ చాలాసార్లు హఠాత్తుగా అదృశ్యమయ్యారు. 2014లో గరిష్టంగా 40 రోజుల పాటు ఏ పబ్లిక్ ప్లేస్‌లోనూ కనిపించలేదు. 2021వ సంవత్సరం చివరిలో కూడా దాదాపు 30 రోజులు కిమ్ జోంగ్ కనిపించలేదు. మే 2021, ఏప్రిల్ 2020లో కూడా కిమ్ జోంగ్ చాలా కాలం పాటు కనిపించలేదు. అప్పుడు కూడా ఆయన అనారోగ్యంపై ఊహాగానాలు వచ్చాయి.