Fact Check : ఉగ్రవాది మసూద్ అజార్ హత్య.. అసలు విషయమిదీ

Fact Check : ఇండియా మోస్ట్ వాంటెడ్ పాకిస్తానీ ఉగ్రవాది మసూద్ అజార్ బాంబుదాడిలో చనిపోయాడనే టాక్ ఇటీవల నడిచింది.

  • Written By:
  • Updated On - January 2, 2024 / 07:12 PM IST

Fact Check : ఇండియా మోస్ట్ వాంటెడ్ పాకిస్తానీ ఉగ్రవాది మసూద్ అజార్ బాంబుదాడిలో చనిపోయాడనే టాక్ ఇటీవల నడిచింది. బాంబుపేలుడుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై పలు జాతీయ మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ చేయగా.. ఆ ప్రచారమంతా ఒట్టి అబద్ధమని తేలింది. బాంబు పేలుడు వీడియోలు ఇతరత్రా ఘటనలకు సంబంధించినవని.. వాటిని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్  మసూద్ అజార్‌తో లింక్ చేసి అబద్ధపు  ప్రచారం చేశారని వెల్లడైంది. బాంబుదాడిలో ఉగ్రవాది మసూద్ అజార్ హతమయ్యాడనే విషయాన్ని పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కాకర్ ధ్రువీకరించే స్క్రీన్ షాట్లు కూడా నకిలీవే, కల్పితాలే అన్ని రూఢి అయింది.

We’re now on WhatsApp. Click to Join.

వదంతిపై ప్రచారం ఇదీ.. 

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ మర్డర్‌పై పాకిస్తాన్ జాతీయ మీడియాలో ఇటీవల ఎలాంటి వార్తలు కూడా రాలేదు. ఎందుకంటే అలాంటి ఘటనేదీ జరగలేదని వారికి తెలుసు. కానీ పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎప్పటిదో ఒక పాత వీడియోను తీసుకొచ్చి.. దానికి మసూద్ అజార్ మర్డర్‌ జరిగిందనే టెక్ట్స్‌ను రాసి పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అవడంతో భారతీయ మీడియాలో దానిపై క్వశ్చన్ మార్క్‌తో కథనాలను వండి వార్చారు.

Also Read: IPL Betting Case : హైదరాబాద్ ఐపీఎల్ బెట్టింగ్ కేసును మూసేసిన సీబీఐ.. ఏమిటిది ?

వాస్తవాలు ఇవీ(Fact Check).. 

  • ఉగ్రవాది మసూద్ అజార్‌పై గుర్తుతెలియని వ్యక్తులు పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న భావల్‌పూర్‌లో ఒక మసీదు వద్ద బాంబు విసిరారనే ప్రచారం జరిగింది. వాస్తవానికి వీడియోలో కనిపించిన బాంబు పేలుడు ఘటన ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ ఏరియాలో జరిగింది.
  • ఉగ్రవాది మసూద్ అజార్‌పై బాంబుదాడి అంటూ  సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో తేదీ కూడా ఫేకే. అందులోకనిపించిన దాడి జరిగిన వాస్తవిక తేదీ.. 2023 నవంబర్ 3.
  • 2023 నవంబర్ 3న ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు చనిపోగా, 25 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో మసూద్ అజార్‌ అనే పేరు కలిగిన వ్యక్తులెవరూ లేరని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.
  • పాకిస్తాన్ జర్నలిస్ట్ గులాం అబ్బాస్ షా, భారతీయ జర్నలిస్ట్ రవీందర్ సింగ్ రాబిన్, OSINT అనే ట్విట్టర్(ఎక్స్) అకౌంట్లలో ఈమేరకు సమాచారం లభ్యమైంది. ఉగ్రవాది మసూద్ అజార్‌ హత్య అంటూ ఇటీవల వైరల్ అయిన వీడియోను  ఈ మూడు ట్విట్టర్ అకౌంట్లలో 2023 నవంబర్ 3నే పోస్ట్ చేశారు.
  • కొంతమంది అదే వీడియోను ఇప్పుడు వాడుకొని నెటిజనం చెవుల్లో పూలను పెట్టారు.