Girls Marriage : ఇరాక్ ప్రభుత్వం బాలికల హక్కులను హరించే ఓ వివాదాస్పద చట్ట సవరణ చేయబోతోంది. తొమ్మిదేళ్ల వయసున్న బాలికలను సైతం పురుషులు పెళ్లి చేసుకునేందుకు వీలు కల్పించేలా ఈ చట్ట సవరణ ఉండబోతోంది. విడాకులు, పిల్లల సంరక్షణ, ఆస్తిలో వారసత్వపు హక్కు వంటి విషయాల్లో మహిళల హక్కులకు విఘాతం కలిగించేలా మరికొన్ని సవరణలను కూడా ఇరాక్ ప్రభుత్వం చేయబోతోంది. ఇరాక్ ప్రజలు(Girls Marriage) తమ కుటుంబ వ్యవహారాలపై ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు మతాధికారులు, లేదా పౌర న్యాయవ్యవస్థను ఆశ్రయించేందుకు కూడా అనుమతించేలా చట్ట సవరణలు చేయనున్నారని తెలిసింది. బాలికలను అనైతిక సంబంధాల ముప్పు నుంచి రక్షించేందుకే .. వారికి తొమ్మిదేళ్లకే పెళ్లి చేసే అవకాశాన్ని కల్పించే సవరణను ప్రతిపాదించామని ఇరాక్ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
Also Read :Pinaka Rocket : మేడిన్ ఇండియా ‘పినాక’ కొనుగోలుకు ఫ్రాన్స్ ఆసక్తి
ఇరాక్ ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పుడు ప్రతిపాదనలపై స్థానిక మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. యూనిసెఫ్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే ఇరాక్ అంతటా బాల్య వివాహాల రేట్లు అధికంగా ఉన్నాయి. దాదాపు 28 శాతం మంది ఇరాకీ అమ్మాయిలు 18ఏళ్లలోపే వివాహం చేసుకుంటున్నారు. తాజాగా చేసిన సవరణలు అమల్లోకి వస్తే.. ఇరాకీ బాలికల పరిస్థితి మరింతగా దిగజారే ముప్పు ఉంటుంది. ఇరాక్‌లో 1959లో ‘లా 188’ను ప్రవేశపెట్టారు. దాన్ని అప్పట్లో పశ్చిమాసియాలోనే అత్యంత ప్రగతిశీల చట్టాలలో ఒకటిగా అభివర్ణించారు. ఇరాకీ కుటుంబాలను వారి మత శాఖతో సంబంధం లేకుండా పరిపాలించడానికి ‘లా 188’ విస్తృతమైన నియమాలను అందించింది.ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల బాటలో ఇప్పుడు ఇరాన్ కూడా వెళ్తోందనే ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది. దీనివల్ల మహిళల అక్షరాస్యతా రేటు తగ్గిపోతుందని, ఫలితంగా వివిధ రంగాల్లో వారి భాగస్వామ్యం తగ్గిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కరుడుగట్టిన మతతత్వ వాదం వల్ల ఆర్థిక పురోగతి సాధ్యం కాదని చెబుతున్నారు.