Iraq : తూర్పు బాగ్దాద్ లో భారీ పేలుడు, 10మంది ఫుట్ బాల్ ఆటగాళ్లు మృతి, 20మందికి గాయాలు..!!

ఇరాక్ లోని తూర్పు బాగ్దాద్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పది మంది మరణించారు. 20 మందిపైగా గాయపడ్డారు. ఫుట్ బాల్ స్టేడియం , కేఫ్ సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో మరణించినవారంతా  ఫుట్ బాల్ ఆడినవారేనని భద్రతా అధికారులను ఉటంకిస్తూ నివేదికలు వెల్లడించాయి. అయితే పేలుడు కు సంబంధించిన కారణాలు తెలియరాలేదు. 10 killed, 20+ wounded in an explosion in east Baghdad, Iraq 🇮🇶 […]

Published By: HashtagU Telugu Desk
Iraq

Iraq

ఇరాక్ లోని తూర్పు బాగ్దాద్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పది మంది మరణించారు. 20 మందిపైగా గాయపడ్డారు. ఫుట్ బాల్ స్టేడియం , కేఫ్ సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో మరణించినవారంతా  ఫుట్ బాల్ ఆడినవారేనని భద్రతా అధికారులను ఉటంకిస్తూ నివేదికలు వెల్లడించాయి. అయితే పేలుడు కు సంబంధించిన కారణాలు తెలియరాలేదు.

ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

  Last Updated: 30 Oct 2022, 05:30 AM IST