Site icon HashtagU Telugu

Supreme Leader Banned : ఆ దేశాధినేతపై ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌లో బ్యాన్.. ఎందుకు ?

Supreme Leader Banned

Supreme Leader Banned

Supreme Leader Banned : ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను తొలగించామని ఫేస్‌బుక్ వెల్లడించింది. తమ కంటెంట్ పాలసీని ఆయన ఉల్లంఘించినందు వల్లే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.  ‘‘ప్రమాదకర సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన మా పాలసీని ఆయతుల్లా అలీ ఖమేనీ పదేపదే ఉల్లంఘించారు. అందుకే ఆయన ఖాతాలను తీసివేశాం’’ అని మెటా ప్రతినిధి తెలిపారు. 35 ఏళ్లుగా ఇరాన్‌లో అధికారంలో ఉన్న ఖమేనీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.  ఫేస్‌బుక్‌లోనూ ఖమేనీకి లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్నారు. రెండేళ్ల క్రితమే (2022 సంవత్సరంలో) ఖమేనీకి చెందిన అకౌంట్‌పై ట్విట్టర్ (ఎక్స్) కూడా బ్యాన్ విధించింది.

We’re now on WhatsApp. Click to Join

ప్రస్తుతం అమెరికాకు బద్ధ వ్యతిరేకిగా ఇరాన్ ఎదుగుతోంది. ఈక్రమంలో రష్యా, చైనా, ఉత్తర కొరియాల మద్దతును ఆ దేశం పొందుతోంది. అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను అమెరికా సమర్ధిస్తుండగా.. ఇరాన్ వ్యతిరేకిస్తోంది. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల్లోని మిలిటెంట్లకు ఆయుధాలను అందించి ఇజ్రాయెల్‌పై దాడులు చేయించడంలో ఇరాన్ కీలక పాత్ర పోషిస్తోంది. యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లు,  లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లు, సిరియాలోని ఇరాన్ మిలీషియా సభ్యులు, ఇరాక్‌లోని ఖతాయిబ్ హిజ్బుల్లా మిలిటెంట్లు ఆయుధాలను పొందుతున్నది ఇరాన్ నుంచే. ఇరాన్ తయారు చేస్తున్న అధునాతన సూసైడ్ డ్రోన్లు, మిస్సైళ్లను ఈ మిలిటెంట్ గ్రూపులు వాడుకొని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. గాజాలోని హమాస్ మిలిటెంట్లకు రాకెట్ల తయారీలో ట్రైనింగ్ ఇచ్చింది కూడా ఇరానే అనే వాదన ఉంది.

Also Read : Uttarakhand Violence : నలుగురి మృతి.. 250 మందికి గాయాలు.. మదర్సా కూల్చివేతతో ఉద్రిక్తత

ఆ ఎటాక్‌లో అమెరికా సైనికులు చనిపోవడంతో..

జోర్డాన్‌లో అమెరికా రహస్యంగా నిర్వహిస్తున్న ఒక సైనిక స్థావరంపై ఇటీవల ఇరాక్‌లోని ఇరాన్ సమర్ధిత మిలిటెంట్ గ్రూప్ సూసైడ్ డ్రోన్ ‌తో ఎటాక్ చేసింది. ఈ దాడిలో డజన్ల కొద్దీ అమెరికా సైనికులు చనిపోయారని తెలుస్తోంది. అయితే కేవలం ముగ్గురే చనిపోయారని అమెరికా సర్కారు అంటోంది. ఈ ఘటనతో అమెరికా నెటిజన్లు ఇరాన్‌పై ఫైర్ అవుతున్నారు. ఇరాన్ ప్రభుత్వంతో ముడిపడిన అన్ని సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేయాలనే ఒత్తిడి అమెరికా సోషల్ మీడియా సంస్థలపై  పెరుగుతోంది. దీనికి స్పందించిన ఫేస్ బుక్ ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను తొలగించింది. మిలిటెంట్ గ్రూపులను సమర్ధిస్తూ వీడియోలను, మెసేజ్‌లను పోస్ట్ చేసినందుకు ఈ చర్యలు(Supreme Leader Banned) తీసుకుంది. పదేపదే అమెరికాకు వార్నింగులు ఇవ్వడం కూడా ఈ నిర్ణయం తీసుకునే దిశగా ఫేస్‌బుక్‌ను నడిపించింది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫేస్‌బుక్ కంపెనీ సాధారణంగా ఆ దేశ ప్రయోజనాలను కాపాడేందుకే  తొలి ప్రాధాన్యత ఇస్తుందనేది విస్పష్టం.

Exit mobile version