Site icon HashtagU Telugu

AI Missile : ఏఐ మిస్సైల్.. ప్రయోగించాక కూడా డైరెక్షన్‌ను మార్చొచ్చు

Ai Missile

Ai Missile

AI Missile : డ్రోన్లు, మిస్సైళ్ల టెక్నాలజీలో ఇరాన్ దూసుకుపోతోంది. యావత్ అరబ్ ప్రాంతంలో ఆయుధాల తయారీలో ఇరాన్ ముందంజలో నిలుస్తోంది. ఈక్రమంలోనే తాజాగా మరో అధునాతన మిస్సైల్‌ను ఇరాన్ తయారు చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో పనిచేసే ఈ నూతన క్రూయిజ్ మిస్సైల్ పేరు.. ‘అబూ మహదీ’. తక్కువ ఎత్తులో ఎగురుతూ రాడార్ గుర్తింపు నుంచి తప్పించుకోవడం ఈ మిస్సైల్ ప్రత్యేకత. జామింగ్‌తో పాటు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌ను కూడా ఇది తట్టుకోగలదు. ఈ ఆధునిక క్షిపణిని భూమి నుంచి, సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. 1000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది(AI Missile)  ఛేదించగలదు.

We’re now on WhatsApp. Click to Join.

ఇరాన్ నౌకాదళానికి చెందిన నౌకలకు ఇకపై ‘అబూ మహదీ’ మిస్సైల్స్‌ను అమర్చనున్నారు. వీటి మరో స్పెషాలిటీ ఏమింటే.. ప్రయోగించిన తర్వాత కూడా వెళ్లాల్సిన దారిపై దానికి కొత్త గైడెన్స్ ఇవ్వొచ్చు. దాడి చేయాల్సిన లక్ష్యాన్ని ఏ క్షణంలోనైనా మార్చుకోగలిగే వెసులుబాటు  ‘అబూ మహదీ’ మిస్సైల్స్‌‌లో ఉంది. దీనివల్ల అబూ మహదీ క్షిపణిని ప్రయోగిస్తే.. అది ఎటువైపు వెళ్తుందో ముందే శత్రువులు అంచనా వేయలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. శత్రుదేశాల మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ ఏఐ మిస్సైల్  డైరెక్షన్‌ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఏ క్షణంలోనైనా మార్చవచ్చు. యుద్ధనౌకలు, డెస్ట్రాయర్లపై దాడికి ఈ తరహా మిస్సైళ్లు పనికొస్తాయి. 410 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం అబూ మహదీ ఏఐ మిస్సైల్‌కు ఉంది.

Also Read: Atal Bihari Vajpayee : వాజ్‌పేయి స్ఫూర్తిప్రదాత.. ప్రధాని మోడీ వీడియో సందేశం