Site icon HashtagU Telugu

Ebrahim Raisi Death: అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో ఇరాన్ లో సంబరాలు

Ebrahim Raisi Death

Ebrahim Raisi Death

Ebrahim Raisi Death: ఒక దేశ అధ్యక్షుడు మరణిస్తే ప్రపంచ దేశాలు ఆ దేశానికి తోడుగా నిలుస్తాయి. కానీ ఇరాన్ ప్రజలు ఆ దేశ అధ్యక్షుడి మరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బాణాసంచా కలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. కొందరైతే మద్యం సేవిస్తూ చిందులేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దీన్ని ప్రపంచదేశాలు చీకటి రోజుగా పరిగణిస్తున్నారు. కానీ ఇరాన్ లోని కొందరు సంబరాల్లో మునిగిపోయారు. ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో చిక్కిన ఖైదీలను అధ్యక్షుడు రైసీ దారుణంగా ఉరి వేయించడాని కొందరి వాదన. ఆయన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కూడా కఠినంగా శిక్షించినట్ల ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు మహిళల వస్త్రధారణపై కూడా అతను అనేక ఆంక్షలు పెట్టాడు. ముస్లింల హిజాబ్ విషయంలో అనేక ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే కొందరు ఆయన మరణాన్ని సంబురాలు చేసుకుంటున్నారు.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణాంతరం ఇరాన్-అమెరికన్ జర్నలిస్ట్ మాసిహ్ అలినేజాద్ ఎక్స్ లో ఆసక్తికరంగా స్పందించారు. చరిత్రలో ఎవరైనా ప్రాణాలతో బయటపడితే ఆందోళన చెందే ఏకైక ప్రమాదం ఇదేనని నేను భావిస్తున్నాను. ప్రపంచ హెలికాప్టర్ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆ జర్నలిస్ట్ పోస్ట్ చేశారు. ఇబ్రహీం రైసీ భద్రత కోసం ప్రార్థన చేయడానికి టెహ్రాన్ మరియు మషాద్‌లోని ప్రధాన కూడళ్లలో వందలాది మంది గుమిగూడగా, ఇరానియన్లు ఈ వార్తను సంబరాలు చేసుకుంటున్నట్లు చూపించే అనేక వీడియోలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఇరానియన్లు మరియు ఇరాన్ ప్రవాసులు కూడా క్రాష్ మీమ్‌లను ఎంజాయ్ చేస్తున్నారు.

రైసీ కేవలం ఇరాన్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీకి వారసుడిగా పేరు వర్ణిస్తుంటారు. ఇరాన్ అధ్యక్షుడి క్షేమం గురించి వార్తల కోసం ప్రపంచ దేశాలు టీవీ స్క్రీన్‌లు మరియు స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కొని ఉండగా, ఇరాన్ లో చాలా మంది కసాయిగా చుస్తున్నారు. తన మరణాన్ని పండుగలా చేసుకోవడం గమనార్హం. శనివారం ఇరాన్ పర్వత వాయువ్య ప్రాంతంలో అధ్యక్షుడి హెలికాప్టర్ కూలిపోవడంతో ఆందులో ప్రయాణించిన వారంతా మరణించినట్లు ధృవీకరించారు. కాగా సయ్యద్ ఇబ్రహీం రైసీ మరణంపై ప్రధాన మంత్రి నేరంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: 18 Dead: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 18 మంది దుర్మ‌ర‌ణం

Exit mobile version