Iran Warning : ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చింది. గాజాపై దాడిని ఇంకా కొనసాగించినా.. దానిలోకి ప్రవేశించి గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించినా రాబోయే కొన్ని గంటల్లో బలమైన ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ను అడ్డుకునేందుకు లెెబనాన్ లోని హిజ్బుల్లా శాయశక్తులా ప్రయత్నిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ స్పష్టం చేశారు. ఇక ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా స్పందించారు. ‘‘ఇజ్రాయెల్ మారణకాండ గాజాలో కొనసాగితే ముస్లిం శక్తులు తప్పకుండా బదులిస్తాయి. ఇజ్రాయెల్ కు బుద్ధి చెప్పకుండా ముస్లిం సమాజాన్ని ఎవరూ ఆపలేరు’’ అని ఆయన తేల్చి చెప్పారు. గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ తగిన శిక్షను అనుభవించక తప్పదన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
హమాస్ ప్రకటన..
హమాస్ కూడా కీలక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ కు తాము భయపడేది లేదని ఓ ప్రకటనలో తెలిపింది. గాజాలోకి వచ్చే ఇజ్రాయెలీ సైనికులను ఇక్కడే పాతిపెడతామని వార్నింగ్ ఇచ్చింది.
Also Read: Niharika Konidela : నిహారిక తట్టుకోలేకపోతుందా..? మనల్ని తట్టుకోలేకుండా చేస్తుందా..?
ఇజ్రాయెల్ స్పందన..
స్వయంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్, హిజ్బుల్లా వార్నింగ్ లపై రియాక్ట్ అయ్యారు. తమ సహనాన్ని పరీక్షించేలా వెర్రి వ్యాఖ్యలు చేయొద్దన్నారు. గాజాలోని తమ వాళ్లను విడిపించుకోవడం, హమాస్ ను అంతం చేయడం అనే లక్ష్యాలను పూర్తి చేసే క్రమంలో తమను ఎవరూ ఆపలేరని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ కు అండగా జర్మనీ కూడా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ కు వార్నింగ్ లు ఇవ్వడం ఆపేసి.. ఎవరి పనులు వారు చూసుకోవాలని ఇరాన్, హిజ్బుల్లాలకు సూచించింది. గాజా వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని జర్మనీ హితవు పలికింది.