Israel-Iran: ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ దాడులను ఖండిస్తూ, ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఒక కఠినమైన ప్రకటన చేశారు. అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కి, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి అమెరికా ఈ చర్యల ద్వారా వ్యతిరేకంగా వ్యవహరించిందని విమర్శించారు. “ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడైన దేశంగా ఉండి కూడా ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడడమంటే, అంతర్జాతీయ స్థాయిలో రెచ్చగొట్టే వ్యవహారమే,” అని అరఘ్చి వ్యాఖ్యానించారు. తాము సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కు వినియోగిస్తామని స్పష్టం చేశారు.
RGIA: ఇరాన్ రూట్ మూసివేత.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం ఆలస్యం
అరఘ్చి ఇంకా చెప్పారు: “అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ ప్రజల రక్షణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ చర్యలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. టెల్ అవీవ్ పై భారీ ప్రతిదాడులకు మేము సిద్ధంగా ఉన్నాం.” ఇదిలా ఉండగా, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్ ఇటీవల రెండు దశల్లో ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 86 మంది గాయపడినట్లు సమాచారం. ఉత్తర , మధ్య ఇజ్రాయెల్ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు!