Iran Spy : లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇటీవలే ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మరణించాడు. ఈ ఘటనపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. హసన్ నస్రల్లా కదలికలపై ఇజ్రాయెల్‌కు ఇంత పక్కా సమాచారం చేరవేసింది ఎవరు ? అనే వివరాలతో ఫ్రాన్స్ మీడియాలో ఒక సంచలన కథనం ప్రచురితమైంది. వివరాలివీ..
Also Read :NASA Hacked : ఏకంగా నాసా వెబ్‌సైట్లనే హ్యాక్ చేశాడు.. నాసా ఏం చేసిందంటే..
‘‘లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఒక పెద్ద భవనం కింద ఉన్న బంకర్‌లోకి హసన్ నస్రల్లా వెళ్లారు’’ అనే సందేశాన్ని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాద్‌కు చేరవేసింది ఎవరో కాదు.. ఒక ఇరాన్ గూఢచారి అని ఆ కథనంలో ప్రస్తావించారు. ఈ సమాచారాన్ని అందుకున్న కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ వాయుసేన(Iran Spy) తమ యుద్ధ విమానాలను బీరుట్ నగరంపైకి పంపింది. అయితే అవి కచ్చితంగా హసన్ నస్రల్లా ఉన్న బంకర్‌ను లక్ష్యంగా చేసుకుంటాయని ఎవరూ అనుకోలేదు. ఈసారి అవి బంకర్ బస్టర్ బాంబులతో బీరుట్‌కు చేరుకున్నాయి. తొలుత హసన్ నస్రల్లా దాక్కున్న బంకర్ పై ఉన్న భవనంపై యుద్ధ విమానాలు బాంబులను జారవిడిచాయి. దీంతో ఆ భవనం పేకమేడలా కూలిపోయింది. అందులో ఉన్నవాళ్లంతా చనిపోయారు. ఆ వెంటనే సదరు భవనం కింద ఉన్న బంకర్‌పైకి దాదాపు 60 బంకర్ బస్టర్ బాంబులను యుద్ధ విమానం జారవిడిచింది. దీంతో ఆ బంకర్ పూర్తిగా ధ్వంసమై అందులో దాక్కున్న హసన్ నస్రల్లా , ఆయన అనుచరులు మరణించారు. ఈవివరాలను ఫ్రాన్స్‌లోని ఓ మీడియా కథనంలో ప్రస్తావించారు.
Also Read :Hezbollah Unit 910 : రంగంలోకి హిజ్బుల్లా ‘యూనిట్ 910’.. ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్
2006 సంవత్సరంలోనూ లెబనాన్‌తో ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. ఆనాడు ఎదురైన చేదు ఫలితం దృష్ట్యా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా గూఢచార వనరులను పెంచుకుంది. వివిధ శత్రు దేశాల గూఢచారులను కూడా తమ కోసం పనిచేసేలా ఇజ్రాయెల్ రిక్రూట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇరాన్ గూఢచార సంస్థలోని ఒక గూఢచారి నుంచి ఈసారి సమాచారాన్ని రప్పించుకొని.. హసన్ నస్రల్లాను హతమార్చింది. వాస్తవానికి ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం రావడానికి ముందు.. ఇరాన్ గూఢచార సంస్థతో ఇజ్రాయెల్ మోసాద్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. నేటికీ ఇరాన్ నిఘా వర్గాలలోని పలువురితో ఇజ్రాయెల్ టచ్‌లోనే ఉందని కొందరు చెబుతుంటారు. ఆ తరహా నెట్‌వర్క్‌తోనే ఇటీవలే ఇరాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీలను కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టిందనే ప్రచారం ఉంది.అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.