Site icon HashtagU Telugu

Israel Vs Iran : గాజాలోకి ఇజ్రాయెల్ అడుగుపెడితే యుద్ధమే.. ఇరాన్ ప్రకటన

Israel Vs Iran

Israel Vs Iran

Israel Vs Iran : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ కు ఇరాన్ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈసారి ఐక్యరాజ్యసమితి (యూఎన్)లోని తమ దౌత్య విభాగం ద్వారా ఇజ్రాయెల్ కు ఈ వార్నింగ్ సందేశాన్ని అధికారికంగా పంపించింది. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ను ఇజ్రాయెల్ మొదలుపెడితే తాము తప్పకుండా స్పందించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.  యుద్ధ నేరాలు, వర్ణ వివక్ష, మారణహోమాన్ని ఇజ్రాయెల్ ఆపకపోతే పరిస్థితి అదుపు తప్పుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఈమేరకు తాము ఇజ్రాయెల్ కు పంపిన సందేశంతో సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. గాజాలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలిలోని దేశాలపై ఉందని స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రకటన విడుదల చేయడానికి ముందు ఇరాన్ .. ఇజ్రాయెల్ బార్డర్ లోని సిరియా, లెబనాన్, ఇరాక్, టర్కీ, సౌదీ, ఖతర్ దేశాల అధినేతలతో కూడా చర్చలు జరిపింది. యుద్ధం చేయాల్సి వస్తే తమకు సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది. ఖతర్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ చర్చలన్నీ జరిగాయని అంటున్నారు. మరోవైపు  గాజాలో తమ సైన్యంతో ఇవాళ గ్రౌండ్ ఆపరేషన్ ను మొదలుపెట్టేందుకు ఇజ్రాయెల్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఏ క్షణమైనా గ్రౌండ్ ఆపరేషన్ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.

అమెరికా వర్సెస్ ఇరాన్

మరోవైపు అమెరికా ఆయుధాలతో ప్రత్యేక యుద్ధ నౌక మార్గం మధ్యలో ఉంది. ఒకవేళ ఈ యుద్ధంలోకి ఇరాన్ ఎంటరైతే.. దాన్ని కట్టడి చేసే లక్ష్యంతోనే అమెరికా ఆయుధ సంపత్తిని ఇజ్రాయెల్ కు పంపిస్తోందని అంటున్నారు. గాజా గ్రౌండ్ ఆపరేషన్ నేపథ్యంలో లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఈజిప్ట్ బార్డర్ కు వలస వెళ్లారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 2300 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 10వేల మందికిపైగా తీవ్ర గాయాలతో (Israel Vs Iran) ఆస్పత్రి పాలయ్యారు.

Also Read: Ind – Pak Match : వారే ఈ విజయానికి కారణం…ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోమన్న రోహిత్