Site icon HashtagU Telugu

US Vs Iran : అమెరికాపై ఇరాన్ ప్రతీకారం.. యూఎస్ నౌక సీజ్.. ఎందుకు ?

Us Vs Iran

Us Vs Iran

US Vs Iran : ఒమన్ తీరంలో ఒక అమెరికన్ ఆయిల్ ట్యాంకరు నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. ఈ నౌక పేరు ‘సెయింట్ నికోలస్’.  గ్రీకు యాజమాన్యంలోని ఈ నౌక మార్షల్ దీవుల జెండాతో ఒమన్ గల్ఫ్ సముద్రం మీదుగా వెళ్తుండగా ఇరాన్ నౌకాదళం అదుపులోకి తీసుకుంది. తమ దేశానికి చెందిన కోర్టు ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ఇదే నౌకకు గతంలో ‘సూయజ్ రాజన్’ అనే పేరు ఉండేది.  2023 సెప్టెంబరులో ఈ నౌక ద్వారా తరలిస్తున్న 9.80 లక్షల బ్యారెళ్ల  ఇరాన్ ముడి చమురును అమెరికా అధికారులు ఒమన్ గల్ఫ్ సముద్ర ప్రాంతంలో సీజ్ చేశారు. ఆనాడు తమ నౌకను ముడి చమురుతో సహా దొంగిలించి అమెరికా తీసుకెళ్లిందని ఇరాన్ ఆర్మీ ఆరోపిస్తోంది. తమ దేశంలో ఈ నౌక దొంగతనం వ్యవహారంపై విచారణ జరిగిందని, అమెరికాపై కోర్టు జరిమానా కూడా విధించిందని చెబుతోంది. ఈ పరిణామంతో నౌక పేరును సూయజ్ రాజన్ నుంచి సెయింట్ నికోలస్‌కు అమెరికా మార్చేసింది అంటోంది. ఇప్పుడు అదే నౌకను తాము అదుపులోకి తీసుకొని.. బందర్-ఎ-జాస్క్ ఓడరేవుకు తీసుకెళ్లామని ఇరాన్ ఆర్మీ వెల్లడించింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇరాన్  ఈ యాక్షన్ తీసుకుందని ఇరాన్ మీడియాలో కథనాలు(US Vs Iran) వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

‘సెయింట్ నికోలస్’ నౌకను అదుపులోకి తీసుకున్న వెంటనే ఇరాన్ నౌకాదళం సిబ్బంది.. దానిలోని కెమెరాలను కవర్ చేశారు. ఈ ఓడలో మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 18 మంది ఫిలిపినోలు, ఒకరు గ్రీకు వ్యక్తి. ఈ నౌక గ్రీస్‌కు చెందిన ఎంపైర్ నావిగేషన్‌ కంపెనీకి చెందినది. ఈ ఆయిల్ ట్యాంకరు నౌక 1.45 లక్షల టన్నుల ముడి చమురుతో ఇరాక్‌లోని బస్రా నుంచి సూయజ్ కెనాల్ మీదుగా టర్కీలోని అలియాగాకు వెళ్తుండగా ఇరాన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది.

Also Read: Unique Auction of Fighter Rooster : పందెం కోడిని వేలానికి సిద్ధం చేసిన TSRTC

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసిమ్ సులేమానీ నాలుగో వర్ధంతి రోజున(జనవరి 3న) ఆయన సమాధికి సమీపంలో జరిగిన జంట పేలుళ్లలో 103 మందికి పైగా మరణించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కెర్మన్ నగరంలోని సాహెబ్ అల్ జమాన్ మసీదు సమీపంలో ఒక ఊరేగింపు జరుగుతుండగా ఈ పేలుళ్లు సంభవించినట్లు ఇరిబ్ పేర్కొంది. అధికారిక మీడియా పేర్కొన్నదాని ప్రకారం, రెండు భయంకరమైన పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి.ఈ ఘటనలో మరణాల సంఖ్య 103కి పెరిగిందని ఇరాన్‌లో ఎమర్జెన్సీ సేవలను అందించే సంస్థ తెలిపింది. పేలుళ్ల కారణంగా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు చెప్పింది.