Site icon HashtagU Telugu

Iran-Israel : ఇజ్రాయెల్‌పై మరోసారి ఇరాన్ దాడులు

Israel-Iran Ceasefire

Israel-Iran Ceasefire

Iran-Israel : శనివారం రాత్రి అమెరికా చేపట్టిన దాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై విజయవంతమైన వైమానిక దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఇది అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అగ్రరాజ్యం చేసిన ఈ సైనిక చర్యతో ఇరాన్ వెనక్కి తగ్గుతుందని అనుకున్నప్పటికీ, వాస్తవం భిన్నంగా ఉంది.

అందరి అంచనాలను తలకిందుల చేస్తూ, దాడి తర్వాత కొద్దిసేపటికే ఇరాన్ తిరిగి స్పందించింది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్ అవీవ్‌తో పాటు ఇతర ప్రాంతాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, దాడులు కొనసాగించడం భవిష్యత్‌కు సంబంధించి ఎన్నో అనిశ్చితతలకు దారితీస్తుందని పలు దేశాలు భావిస్తున్నాయి.

ఇరాన్‌పై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ ఘర్షణకు మూడో ప్రపంచ యుద్ధం ముప్పుగా మారే అవకాశాన్ని కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా నిలవగా, ఇరాన్‌కు మద్దతుగా రష్యా, చైనా తదితర దేశాలు బరిలోకి దిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే అంతర్జాతీయ శాంతికి పెద్ద ముప్పుగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌ను శాంతి చర్చలకు రావాలని కోరుతూ, “ఇది శాంతికి తగిన సమయం” అంటూ పిలుపునిచ్చారు. కానీ ఆ హెచ్చరికలను లెక్కచేయకుండా ఇరాన్ మరోసారి దాడులకు తెగబడటంతో, దీనికి దారితీసే పరిణామాలపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Netanyahu : “మేము మొదలుపెట్టాం.. అమెరికా పూర్తి చేసింది”.. నెతన్యాహు వ్యాఖ్యలు