Site icon HashtagU Telugu

Iran President: హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి!

Iran President

Iran President

Iran President: ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఇరాన్ అధ్యక్షుడు (Iran President) ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అజర్‌బైజాన్ సమీపంలో కూలిపోయింది. రెడ్ క్రెసెంట్ రెస్క్యూ టీమ్ హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశానికి చేరుకున్నట్లు అల్ జజీరా నివేదించింది. అయితే ఈ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఇరాన్ అధ్య‌క్షుడితో పాటు విదేశాంగ మంత్రి కూడా మ‌ర‌ణించిన‌ట్లు ది స్పెక్ట‌ర్ ఇండెక్స్ అనే ఎక్స్ అకౌంట్ త‌న ట్వీట్‌లో తెలిపింది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. అధికారులు సైతం అక్క‌డి ప‌రిస్థితులు బాగ‌లేవ‌ని చెబుతున్నారే త‌ప్ప అస‌లు విష‌యం చెప్ప‌టం లేద‌ని మీడియా సంస్థ‌లు పేర్కొంటున్నాయి.

అంతకుముందు టర్కీ శోధన డ్రోన్‌లు అజర్‌బైజాన్ కొండలపై మండే స్థలాన్ని కనుగొన్నాయి. ఆ తర్వాత సెర్చింగ్‌ టీమ్‌ని అక్కడికి పంపినట్లు చెప్పారు. దట్టమైన అడవులు, కొండలు ఉన్న ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది. సెర్చింగ్ కోసం ఇరాన్ ప్రభుత్వం 40 బృందాలను ఏర్పాటు చేసింది. నిన్న రాత్రి నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భారత్‌తో పాటు పలు దేశాలు సహాయక బృందాలను పంపుతున్నాయి. దట్టమైన పొగమంచు, చలి, వర్షం, చెడు వాతావరణం కారణంగా వెతకడం కష్టంగా మారింది. ఇరాన్ రాష్ట్ర మీడియా IRNA ప్రకారం.. మే 19 ఉదయం అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి రైసీ ఆనకట్ట ప్రారంభోత్సవానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలోని ఇరాన్‌లోని వర్జెఘన్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది.

Also Read: Hema – Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ.. దొరికిపోయిన యాక్టర్ హేమ

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోవడంతో యావత్‌ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆదివారం హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గురించి ఇంకా ఎటువంటి వార్త లేదు. అతను ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయాలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్థారణ సమాచారం అందలేదు. అయితే ఇరాన్ రైసీ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఇరాన్ మీడియా పేర్కొంది.

We’re now on WhatsApp : Click to Join

ప్రమాదం జరిగి చాలా గంటలు గడిచిపోయాయని, రెస్క్యూ బృందాలు ప్రెసిడెంట్ రైసీ బ‌తికి ఉన్న‌ట్లు గుర్తించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇరాన్ అబ్జర్వర్ పేర్కొంది. ప్రస్తుతం సెర్చ్‌ ఆపరేషన్‌ ముమ్మరం చేసి రైసీ దొరికే వరకు ఏం మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పుడు రైసీ ఏ హెలికాప్టర్‌లో ప్రయాణించారు..? అది ఏ కంపెనీకి చెందినది అనే ప్రశ్న తలెత్తుతుంది.