Site icon HashtagU Telugu

Iran : మహ్సా అమిని తర్వాత.. పోలీస్ కస్టడీలో 19ఏళ్ల యువకుడు మృతి..!!

Shahid

Shahid

హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. మహ్సాఅమిని తర్వాత ఇప్పుడు మరో యువకుడిని కొట్టి చంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.  ఇరాన్ సెలబ్రిటీ చెఫ్ మహషాద్ షాహిదీ పోలీస్ కస్టడీలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. చెఫ్ మహషాద్ ను ఇరాన్ కు చెందిన జామీ ఆలివర్ ను అని పిలుస్తారు. 19ఏళ్ల మహషాద్ ను ఇరాన్ కు చెందిన రివల్యూషనరీ గార్డ్ దారుణంగా కొట్టి చంపారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనతో ఇరాన్ ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. తీవ్రంగా నిరసనగా వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  సామాన్యులకు గుడ్ న్యూస్…భారీగా తగ్గిన LPG సిలిండర్ ధర…!!

ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందకు షాహిదీని అక్టోబర్ 25న పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 29న కస్టడీలో ఉండగానే మరణించాడు. అతని అంత్యక్రియల తర్వాత ఇరాన్ లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఇరాన్ నివేదికల ప్రకారం…షాహిదీని ఇరాన్ భద్రతా దళాలు లాఠీలతో కొట్టి వదిలేశారు. షాహిదీకి తలకు బలంగా గాయాలవడంతో అతను మరణించినట్లు పేర్కొన్నాయి. అయితే షాహిదీ గుండెపోటుతో మరణించినట్లు చెప్పాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు షాహిదీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం షాహిదీది సహజమరణమే అంటున్నారు.