Iran Attack : అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ ఎటాక్

Iran Attack : ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్లు మరోసారి అమెరికాను లక్ష్యంగా చేసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Iran Strike

Iran Strike

Iran Attack : ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్లు మరోసారి అమెరికాను లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాక్‌లోని అల్-అస్సాద్ ప్రాంతంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరంపై  బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడిలో పలువురు అమెరికా సైనికులు చనిపోయారు. అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలను అమెరికా వెల్లడించలేదు. ఈ దాడి జరిగిన విషయాన్ని అమెరికా ఆర్మీ సెంట్రల్ కమాండ్ కూడా ధ్రువీకరించింది. శనివారం ఉదయం ఇజ్రాయెల్ ఆర్మీ సిరియా రాజధాని డమస్కస్‌లోని ఇరాన్ ఇంటెలీజెన్స్ కార్యాలయంపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ ఆర్మీకి చెందిన ఐదుగురు సభ్యులు మరణించారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్.. కొన్ని గంటల్లోనే (శనివారం రాత్రి) ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఈ దాడులు(Iran Attack) చేయించింది.

We’re now on WhatsApp. Click to Join.

గత సోమవారం సాయంత్రం ఇరాన్ స్వయంగా ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో మిస్సైల్స్, డ్రోన్లకు విరుచుకుపడింది. ఆ ప్రాంతంలోని ఒక భవనంలో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మోసాద్‌కు చెందిన ఏజెంట్లు సమావేశమయ్యారని సమాచారం అందుకున్న ఇరాన్.. ఆ భవనం లక్ష్యంగా దాదాపు 1250 కిలోమీటర్ల దూరం నుంచి మిస్సైల్స్ ప్రయోగించింది. మిస్సైల్స్ సూటిగా వచ్చి ఈ భవనాన్ని కూల్చేశాయి. దీంతో అందులోని మోసాద్ ఏజెంట్లు అందరూ చనిపోయారు. దాదాపు 9 మంది చనిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుండటంతో పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తోంది. దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. ఇరాక్‌లో దాదాపు 2,500 మంది , సిరియాలో 900 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఖతర్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలలోనూ అమెరికాకు మిలిటరీ బేస్‌లు ఉన్నాయి. ఇటీవల ఇరాక్ సర్కారు ఒక అడుగు ముందుకు వేసి.. తమ దేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని అమెరికా ఆర్మీకి అల్టిమేటం ఇచ్చింది. అప్పటి నుంచి ఆ దేశంలోని మిలిటరీ బేస్‌లపై దాడులు పెరిగాయి.

Also Read: Sreeleela : శ్రీలీల కు ఇక గడ్డుకాలమేనా..?

  Last Updated: 21 Jan 2024, 07:28 AM IST