ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం (Iran-Israel War) రోజు రోజుకు భీకరంగా మారుతోంది. ఇరాన్ పట్ల ఇజ్రాయెల్ నిర్వహించిన ఎయిర్ స్ట్రైక్స్ వల్ల మరణించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సమాచారం. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థలు వెల్లడించిన నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు 639 మంది ఇరానీయులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు, వందలాది మంది గాయపడినట్లు పేర్కొంది. అయితే ఇరాన్ అధికారికంగా మాత్రం 263 మంది మాత్రమే చనిపోయినట్టు చెబుతోంది.
Aadhaar Card: ఇంటి నుంచే నిమిషాల్లో ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోండిలా!
ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా కొన్ని మిలిటరీ కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయని మాత్రమే పేర్కొంది. మృతుల సంఖ్యను తగ్గించి చూపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన యాక్టివిస్టుల వివరాల ప్రకారం.. చాలా మంది సాధారణ పౌరులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని వారు పేర్కొన్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో యుద్ధం ఇంకా ఎంతవరకు వెళ్తుందో అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. మృతుల సంఖ్య పెరగడంతో మానవతా సంక్షోభం ముప్పు పొంచి ఉంది. అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలను సంయమనం పాటించాలని కోరుతున్నా, ప్రస్తుతం ఎలాంటి శాంతిచర్చలూ జరగకపోవడం గమనార్హం. యుద్ధ ప్రభావం ప్రత్తేకంగా మిడిలీస్ట్ ప్రాంతంలో మానవ జీవితాలపై తీవ్రంగా పడుతున్నది.