Iran-Israel : పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడికి దిగింది. ఈ దాడిలో ఇరాన్ మొదటిసారిగా క్లస్టర్ బాంబులను ఉపయోగించినట్లు సమాచారం. ఇది ప్రాంతంలో భీకర విధ్వంసం భయాలను పెంచుతోంది. క్లస్టర్ బాంబులు బాలిస్టిక్ క్షిపణుల కంటే చాలా ఎక్కువ విధ్వంసం కలిగించగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను కొత్త స్థాయికి చేర్చింది.
ఇరాన్ క్షిపణులతో ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా దద్దరిల్లాయి. దాడుల సమయంలో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి, ప్రజలు భయంతో ఆశ్రయాల వైపు పరుగు తీశారు.
ముఖ్యంగా, బీర్షెబాలోని సోరోకా ఆసుపత్రిపై ఇరాన్ దాడి చేసింది. పౌర ప్రాంతాలు , వైద్య సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పరిగణించబడతాయి, ఇది ఈ సంఘర్షణ తీవ్రతను మరింత పెంచుతోంది.
ఇప్పటికే అస్థిరంగా ఉన్న పశ్చిమాసియాలో ఇరాన్ క్లస్టర్ బాంబుల వినియోగం , పౌర లక్ష్యాలపై దాడులు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Shamshabad Airport : రూ.14వేల కోట్లతో శంషాబాద్ ఎయిర్ పోర్టు విస్తరణ!